ఈ శుక్ర‌వారం మూడు సినిమాలు ప్రేక్ష‌కుల తీర్పు కోరుతూ వ‌చ్చాయి. రామాచారి, ల‌వ్‌సైకిల్‌, ల‌వ్‌ట‌చ్ - సినిమాలు రిలీజ్ అయ్యాయి. మూస క‌థ‌తో రామాచారి నిరాశ ప‌రిస్తే... మిగ‌తావి రెండూ బూతు సినిమాలుగా మిగిలిపోయాయి. మూడు సినిమాల‌కూ క‌లెక్షన్లు లేవు. బీసీల్లో రామాచారి ప‌రిస్థితే కాస్త బెట‌ర్‌. పోస్ట‌ర్ల‌పై వేణు, బ్ర‌హ్మానందం, అలీ ఫేసులు చూసి థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు. ల‌వ్‌సైకిల్‌కీ ఓ మోస్త‌రుగా జ‌నాలున్నారు. ల‌వ్ ట‌చ్ సినిమాని ట‌చ్ చేయ‌డానికి కూడా ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించ‌డం లేదు.

ఈ మూడు సినిమాల వ‌ల్ల త‌డాఖా లాభ‌ప‌డింది. మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో.. త‌డాఖాకే ఓటేస్తున్నారు ప్రేక్ష‌కులు. వ‌చ్చే వారం..ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమా వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ చైతూ సినిమాకి ఎదురు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: