ద‌ర్శకుడి త‌ల‌పై కూల్‌డ్రింక్‌ తాగే బాటిల్‌తో, త‌ల‌ ప‌గిలేలా కొట్టింది ఆ హీరోయిన్‌. ఇది స్వయంగా బాలీవుడ్ బాద్‌షా కింగ్‌ఖాన్ షారుఖ్ న‌టిస్తున్న చైన్సై ఎక్స్‌ప్రెస్ మూవీలో చోటు చేసుకుంది.

ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటున్న చివ‌రి రోజున ద‌ర్శకుడు రోహిత్ శెట్టి త‌మ‌షాకి హీరో షారుఖ్‌,హీరోయిన్ దీపికా ప‌దుకొనేల‌కు స్టంట్స్ చేసి చూపిస్తున్నాడు. చూడ‌టానికి త‌మ‌షా అనిపించిన ఒక్కోసారి సీరియ‌స్‌గానే స్టంట్స్ చేస్తున్నారు.

advertisements


ఈ స్టంట్స్ రిలాక్స్ టైంలో కూల్‌డ్రింక్ తాగుతున్న దీపికాను ద‌ర్శకుడు రోహిత్‌శెట్టి విసిగించ‌టం మొద‌లు పెట్టాడు. దీంతో విసుగుచెందిన దీపిక, త‌న చేతిలోని కూల్‌డ్రింక్ గ్లాస్ బాటిల్‌తో ద‌ర్శకుడి త‌ల ప‌గల‌గొట్టింది. బాటిల్ ప‌గిలిందిగాని అదృష్టవ‌శాత్తు కొద్దిపాటి గాయంతో ద‌ర్శకుడు బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న‌కు యూనిట్‌తో పాటు షారుఖ్‌ఖాన్ కూడ ఉలిక్కి ప‌డ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: