మెగా ప్యామిలి హీరోల‌లో అస‌లైన‌ వార‌స‌త్వ హీరో రామ్‌చ‌ర‌ణ్‌తేజ్‌. 2013 ఈ సంవ‌త్సరాన్ని మాంచి జోష్‌తో స్టార్ట్ చేసిన కూడా, త‌రువాత అనుకున్నంత ఊపు కొన‌సాగించలేక‌పోయ‌డ‌నేది విశ్లేకుల వాద‌న‌.

రామ్‌చ‌ర‌ణ్ నాయ‌క్ మూవీతో శుభారంభాన్ని ఇచ్చిన త‌రువాత జెట్ స్పీడ్‌తో జంజీర్‌ను అందుకున్నాడు. జంజీర్ రిలీజ్‌తో చ‌ర‌ణ్ ఇమేజ్‌ నేష‌న‌ల్ ఇమేజ్‌ అంటూ ట్రేడ్స్ లెక్కలు క‌ట్టాయి. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అంతే లేదు. దీనికి త‌గ్గట్టుగానే ఓ ప‌క్క జంజీర్ మూవీ షూటింగ్ జ‌రుగుతుంటే, మ‌రో ప‌క్క తెలుగులో ఎవ‌డు మూవీ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడు రామ్‌చ‌ర‌ణ్‌.

తీరిక లేకుండా మూవీ షెడ్యూల్స్‌ను పెట్టుకుంటున్న, రామ్‌చ‌ర‌ణ్ కొంత‌ అప్‌సెట్‌గా క‌నిపిస్తున్నారంటున్నారు. జంజీర్ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నా కోర్టు గొడ‌తో అట‌కెక్కింది, ఎవ‌డు మూవీ రిలీజ్‌కు ఇంకా టైం ప‌డుతుంది. ఈ లోపు రోడ్డుపై జ‌రిగిన ట్రాపిక్ ర‌చ్ఛ చ‌ర‌ణ్‌ను బాధించింది. అంతే కాకండా స‌మ్మర్ సీజ‌న్‌లో త‌న  దమ్మేంటో చూపిద్దామ‌నుకుంటే ఏ మూవీ రిలీజ్‌కు ర‌డీ గా లేదు. అయినా రామ్‌చ‌ర‌ణ్ షూటింగ్‌ల‌తో బిజిగానే ఉన్నాడు.

కొర‌టాల శివ కాంబినేష్ రాబోతున్న మూవీకు అన్నీ ర‌డీ చేసుకుంటున్నాడు. క‌ష్ట ప‌డ్డ మూవీలు రిలీజ్ కాక‌పోవ‌డంతో తోటి హీరోల‌కు పోటీ ఇవ్వలేక పోతున్నాడు. ఈ విష‌యాలే రామ్‌చ‌ర‌ణ్‌ను ఇబ్బంది పెడుతున్నాయంట‌. వీటిని దృష్టిలో పెట్టుకొని స‌రైన్ ప్లానింగ్ వేసుకొనే ప‌నిలో రామ్‌చ‌ర‌ణ్ నిమ‌గ్నమ‌య్యాడ‌ని స‌న్నిహితుల మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: