షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ఐటం సాంగ్ చేసిన ప్రియమణి, బాలీవుడ్ బాద్షా సరసన ఛాన్స్ రావడమే ఎంతో గొప్ప అన్నట్లుగా ఎటువంటి రేమ్యునరేసన్ తీసుకోకుండా ఊపేసింది. తీరా సాంగ్ బయటికి వచ్చాక ఆ పాటకి ప్రియమణి కరెక్ట్ సెలెక్షన్ కాదని ఆ బాద్షా కూడా తలపట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాద్షాకి మంచి హిట్ మూవీ కావాలి. అందుకోసం ప్రతీది పక్కాగా సెట్ చేసుకొనే ఈ ప్రాజెక్టు చేస్తున్నాడు. ట్రైలరుకి, హీరో, హీరోయిన్ గెట్ అప్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది కాని అదే రెస్పాన్స్ ఆ సాంగుకి రాకపోవడంతో దీనికి ప్రియమణి మాత్రమే మైనస్ అని షారుఖ్ కూడా ఫిక్స్ అయ్యాడంట.


అయితే ప్రియమణి మాత్రం దీనిని ఇంకోలా వాడుకోవాలని చూస్తుంది. ప్రియమణి తాజాగా తన ట్విట్టరులో 'థాంక్స్ డేటింగ్ విత్ మీ షారుఖ్' అంటూ పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. షారుఖ్, ప్రియమణితో డేటింగా? అంటూ అందరూ షాక్ అయ్యారు. కానీ కాసేపటికే 'సారీ! థాంక్స్ డాన్సింగ్ విత్ మీ షారుఖ్' అంటూ ప్రియమణి రీ-పోస్ట్ చేసింది.


ఇది గ్రామర్ మిస్టేక్ అని ఎవరైనా అనుకుంటారా? కావాలని ప్రియమణి చేసిన ఈ తప్పు దేనికోసమో అందరికి తెలిసిన విషయమేగా.

మరింత సమాచారం తెలుసుకోండి: