ఈ సౌండింగ్ చూస్తే కచ్చితంగా మెగా అభిమానుల ఉత్సాహం అంచనా వేయొచ్చు.. ఇప్పుడు కాదు 1992లోనే భారతీయ సిని చరిత్రలో ఏ హీరో అందుకోలేని 1.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకుని మెగాస్టార్ తన సత్తా చాటాడు. 1992లో నటించిన మెగాస్టార్ మూవీ ఘరానా మొగుడు. కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 10 కోట్లు కలక్షన్స్ సాధించింది.  


10 కోట్లు వసూళ్లు ఓ లెక్కా అని అనుకోవచ్చు. అప్పడు టికెట్ ధర కేవలం 5 రూపాయలే.. మరి ఈ లెక్కన ఎన్ని 5 రూపాయలు కలిపితె 10 కోట్లు అవుతాయో లెక్కేసుకోవచ్చు. మెగాస్టార్ స్టామినా దశదిశలల్లా వ్యాపించ చేసిన సినిమా ఇది. అప్పట్లో ద వీక్ మేగజైన్ ఈ సినిమా మీద ఓ కథనం కూడా వేసింది. అందుకు చిరంజీవి ముఖచిత్రంతో పాటుగా 'బిగ్గర్ దాన్ బచ్చన్' అని టైటిల్ పెట్టింది.


బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటే అది కచ్చితంగా మెగాస్టార్ సినిమానే అయ్యుండాలి అని చాటి చెప్పిన సినిమా అది. అప్పటి దాకా పరిధులతో ఉన్న తెలుగు సినిమా మార్కెట్ కోట్లు దాటేలా చేసిన సినిమా అది. ఏప్రిల్ 9 1992 లో రిలీజ్ అయిన ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అంటూ లెక్కలేస్తున్న హీరోలంతా ఒక్కసారి మెగాస్టార్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ చూసి ఏమంటారో మరి.


ఈరోజు పాతికేళ్లు పూర్తి చేసుకుంది ఘరానా మొగుడు సినిమా... సో అది గుర్తుచేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో #25yearsofGharanaMogudu ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్ స్టామినా గుర్తు చేస్తూ ఈరోజు జెమిని టివిలో ఆ సినిమా టెలికాస్ట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: