ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం ‘బాబు బాగా బిజీ’. ఈ మూవీ యూత్ ని తెగ హీటెక్కిస్తుంది. ‘బాబు బాగా బిజీ’ మూవీకి సంబంధించిన పోస్టర్స్ వద్ద నుండి ట్రైలర్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ‘బాబు బాగా బిజీ’ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని తీసుకువస్తుంది. అయితే ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన తేజస్వి ప్రస్తుతం ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.

దీనికి కారణం హీరో అవసరాల శ్రీనివాస్ అని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...అభిషేక్ పిక్చర్స్ స్వయంగా నిర్మించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’.ఈ నెల 5వ తేదీన వేసవి కానుకగా సినిమా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాలీవుడ్ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక హీరోగా అవసరాల శ్రీనివాస్ నటించగా తనకు జోడీగా మిస్తి చక్రబర్తి, శ్రీముఖి, తేజశ్వి మదివాడ, సుప్రియ ఐసోలు నటించారు.

వీళ్ళలో తేజస్వి మడివాడకి ప్రస్తుతం హాట్ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ మూవీలో తేజస్వీ మొదటగా నటించను అంటే అవసరాల శ్రీనివాస్ తనని ఒప్పించి నటించేలా చేశాడని అంటున్నారు. కానీ ప్రస్తుతం తేజస్వీకి వస్తున్న ఆఫర్స్ అన్నీ హాట్ గా ఉండటంతో ఇదంతా ‘బాబు బాగా బిజీ’మూవీ ఎఫెక్ట్ అని భావించింది. అవసరాల శ్రీనివాస్ తనని కావాలని ఈ మూవీలో నటించమని చెప్పి ఇరికించాడని అంటున్నారు.

తన గురించి ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ స్ర్పెడ్ అవుతుందని భావించిన తేజస్వీ...వెంటనే  ‘బాబు బాగా బిజీ’మూవీలో తన రోల్ చాలా డీసెంట్ అని చెప్పుకొచ్చింది. ఇకపై ఈ తరహా పాత్రలను తను చేయనని గట్టిగానే చెబుతుంది. మొత్తానికి ‘బాబు బాగా బిజీ’ మూవీ తేజస్వీకి భారీ పాపులారిటీనే తీసుకువచ్చిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: