బాహుబలితో దర్శకుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన రాజమౌళి తన తర్వాత సినిమా ఎవరితో తీస్తాడు అన్న విషయం మీద ఓ క్లారిటీకి రాలేదు. బాహుబలి తర్వాత జక్కన్న కచ్చితంగా ఓ చిన్న సినిమా తీస్తాడని అంటుంటే లేదు బాహుబలి రేంజ్ లోనే మరో సినిమా ఉంటుందని అంటున్నారు.  


ఇక ఎన్నాళ్లనుండో మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్న రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ తోనే చేసేందుకు సిద్ధమవుతున్నాడని ఎక్స్ క్లూజివ్ న్యూస్. ఇప్పటికే కే.ఎల్ నారయణ మహేష్, రాజమౌళి కాంబినేషన్ సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఇద్దరికి సినిమా చేయాలన్నట్టు కొంతమొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చాడట.


అందుకే బాహుబలి తర్వాత మహేష్ తోనే సినిమా తీయాలని పట్టుపడుతున్నాడట నారాయణ. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమా పూర్తి చేసుకుని కొరటాల శివ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా 2018 సంక్రాంతి టార్గెట్ తో వస్తుంది. అంటే రాజమౌళి సంక్రాంతి తర్వాతనే తన తర్వాత సినిమా చేస్తాడా అని మరో డౌట్ వస్తుంది. 


మహేష్ ఫ్రీ అయ్యేలోగా మర్యాద రామన్న లాంటి చిన్న సినిమా తీసి ఆ తర్వాత మళ్లీ మహేష్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఓ సినిమా తర్వాతో లేక ఈ సినిమానో మొత్తానికైతే మహేష్ తో రాజమౌళి సినిమా మాత్రం ఫిక్స్ అని తెలుస్తుంది. సో మహేష్ ఫ్యాన్స్ ఇక ఈ న్యూస్ తో పండుగ చేసుకోవడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: