రాక‌రాక మ‌రోసారి బాలీవుడ్ అవ‌కాశం వ‌చ్చింది ప్రియ‌మ‌ణికి. అదీ ఐటెమ్ గాళ్‌గా. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారుఖ్ ఖాన్‌తో క‌ల‌సి ఓ ప్ర‌త్యేక గీతంలో చిందేసింది. దాంతో ఈసారి ఎలాగైనా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని తహ‌త‌హ‌లాడుతోంది ప్రియ‌మ‌ణి. అంతే కాదు.. త‌న హీరో షారుఖ్‌ఖాన్‌ని ఆకాశానికి ఎత్తేస్తోంది. త‌న‌లాంటి హీరోని చూడ‌లేదు అని కితాబులు ఇచ్చేస్తోంది.

''షారుఖ్ తో ప‌ని చేయ‌డం సింప్లీ సూప‌ర్బ్‌. నేను క‌ల్లో కూడా ఊహించ‌లేని ఆఫ‌ర్ ఇది. అలాంటి హీరోని నేను చూళ్లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు అభిమానులున్నారు. గొప్ప స్టార్‌. అయినా చాలా నిడారంబరంగా ఉంటారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, చేస్తున్న ప‌నిపై శ్ర‌ద్ధ‌... వీటి నుంచి ఎన్నో నేర్చుకోవ‌చ్చు. బాలీవుడ్‌లో మున్ముందు ఇలాంటి అవ‌కాశాలు ఇంకా ఇంకా వ‌స్తాయ‌ని ఆశిస్తున్నా..'' అంటోంది.

అయితే ప్రియ‌మ‌ణికి బాలీవుడ్‌లో ఇలాంటి ఛాన్సులు రావ‌డం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఎందుకంటే అక్క‌డ ఐటెమ్స్ గాళ్స్‌కి కొర‌త లేదు. క‌థానాయిక‌లుసైతం ప్ర‌త్యేక గీతాల్లో న‌ర్తిస్తున్నారు. వారి మ‌ధ్య ప్రియ‌మ‌ణి నిల‌బ‌డుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: