ఊహించిందే జరిగింది. ఇప్పటికే రేటింగ్స్ లో దూసుకెళ్తున్న బిగ్ బాస్ షోకు మరిన్ని అందాలు తీసుకొచ్చేందుకు స్టార్ మా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తండడంతో ఈ షోకు మంచి పాపులారిటీ వచ్చింది. రేటింగ్స్ కూడా టాప్ లోనే ఉన్నాయి. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఏదో మిస్సవుతోందనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. అందుకే.. దీక్షకు వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చారు..

Image result for BIGG BOSS TELUGU

        బిగ్ బాస్ షో మూడోవారంలోకి ఎంటరైంది. 14మంది వెళ్లిన బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు 11 మంది మాత్రమే మిగిలారు. ఫస్ట్ వీక్ లో జ్యోతి, రెండో వారంలో మధు ప్రియ ఎలిమినేట్ అయ్యారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తనంతట తాను తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో దీక్షా పంత్ ను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపించారు బిగ్ బాస్ నిర్వహకులు.

Image result for DEEKSHA PANTH IN BIG BOSS

        హాట్ హాట్ అందాలకు దిక్షా పంత్ పేరు. గోపాల గోపాల సినిమాతో దీక్ష తెలుగు సినిమాల్లోకి ఎంటరైంది. ఆ సినిమాలో దొంగ మాతగా నటించి మెప్పు పొందింది. హార్మోన్, ఒక లైలా కోసం లాంటి సినిమాల్లో కూడా నటించింది. బంతిపూల జానకి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ లో అందరినీ ఆకట్టుకుంటున్న ధన్ రాజ్ ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించాడు.

Image result for DEEKSHA PANTH IN BIG BOSS

        దీక్ష ఎంపిక వెనుక ఓ కారణముంది. బిగ్ బాస్ హౌస్ పూర్తిగా సంప్రదాయవాదులతో నిండిపోయింది. హాట్ అందాలు మిస్సవుతున్నాయి. ప్రిన్స్ ఇప్పటికే బిగ్ బాస్ కు మొరపెట్టుకున్నాడు. ఓ అందమైన అమ్మాయిని పంపించమని.! బహిశా ప్రిన్స్ రిక్వస్ట్ ను బిగ్ బాస్ కన్సిడర్ చేసినట్లున్నాడు. దీక్ష రూపంలో ప్రిన్స్ కోరిక తీర్చేశాడు.

Image result for DEEKSHA PANTH

        దీక్ష అడుగు పెట్టడమే స్విమ్మింగ్ పూల్లో అడుగుపెట్టింది. దీంతో ఇక హాట్ హాట్ అందాలకు బిగ్ బాస్ హౌస్ అడ్డాగా మారనుంది. ఇప్పటివరకూ స్విమ్మింగ్ పూల్ ను కంటెస్టెంట్స్ ఎవరూ ఉపయోగించలేదు. అందుకేనేమో.. దీక్ష స్విమ్మింగ్ పూల్ నుంచే ఎంట్రీ మొదలుపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: