శ్రుతిహాస‌న్‌కి గోల్డెన్ టైమ్ న‌డుస్తోంది. గ‌బ్బ‌ర్‌సింగ్‌, బ‌లుపు సినిమాల‌తో రెండు విజ‌యాలు అందుకొంది. ఇప్పుడు బాలీవ‌డ్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. శ్రుతి న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా, డీడే సినిమాలు ఒకేసారి విడుద‌య్యాయి. రెండింట్లోనూ శ్రుతి న‌ట‌న‌క కెవ్వు కేక అని... బాలీవుడ్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఒక సినిమాలో క్లాస్‌గా, ఇంకో సినిమాలో మాస్ గా క‌నిపించి తాను ఎలాంటి పాత్ర‌కైనా సిద్ధ‌మే అని చాటి చెప్పింది. దాంతో ఆమె ముందుకు మ‌రిన్ని బాలీవుడ్ సినిమాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కొంత‌మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు శ్రుతిని సంప్ర‌దిస్తున్నార‌ట‌. మ‌రో వైపు తెలుగు నాట ఎవ‌డు సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా కూడా హిట్ట‌యితే శ్రుతి టాప్ పొజీష‌న్ కు రావ‌డం ఖాయం.


''శుక్ర‌వారం రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. రెండూ మంచి వ‌సూళ్లు సాధిస్తున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ...'' అని సంబ‌ర‌ప‌డిపోతోంది శ్రుతిహాస‌న్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: