మొన్నటిదాకా చిన్నా చితకా పాత్రలలో కనిపించిన శ్రీవిష్ణు అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో కాస్త పేరు తెచ్చుకున్నాడు. నారా రోహిత్, శ్రీవిష్ణు ఇద్దరు సమానంగా ఉండే ఆ సినిమాలో అసలు హీరో శ్రీవిష్ణునే అని చెప్పాలి. ఆ సినిమా హిట్ అవడంతో శ్రీవిష్ణు క్రేజ్ బాగా పెరిగింది వరుస అవకాశాలు వస్తున్నాయి.


రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ ఉన్నది ఒకటే జిందగి సినిమాలో కూడా రామ్ తో ఈక్వల్ పాత్ర చేశాడు శ్రీవిష్ణు. సినిమాలో బెస్ట్ ఫ్రెండ్స్ గా రామ్, శ్రీవిష్ణులు నటించగా సినిమాలో శ్రీవిష్ణు పాత్రని కావాలని తగ్గించేశారని అంటున్నారు. అంతేకాదు లుక్ విషయంలో కూడా శ్రీవిష్ణుని ఫార్మల్ గా చూపిస్తూ రామ్ ను స్టైలిష్ గా చూపించారని అంటున్నారు.


ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఉన్నది ఒకటే జిందగి సినిమాలో రామ్ ఎంత ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశాడో శ్రీవిష్ణు కూడా అదే రేంజ్ పాత్ర చేశాడు. అయితే హీరో రామ్ కాబట్టి ఈక్వేషన్స్ అదేలా ఉంటాయని అనుకున్నా కావాలని శ్రీవిష్ణు పాత్రని తొక్కేశారని అంటున్నారు. అంతేకాదు సినిమాలో శ్రీవిష్ణు నటించిన కొన్ని సీన్స్ కట్ చేశారని టాక్. 


కట్ చేసిన సీన్స్ లో శ్రీవిష్ణు హైలెట్ అయ్యాడని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభించిన శ్రీవిష్ణుకి అవకాశాలు వస్తున్నందుకు హ్యాపీగా ఉన్నా కావాలని తనని తొక్కేస్తున్నారన్న వాదన ఉంది. మరి ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో తెలియదు కాని ఉన్నది ఒకటే జిందగి సినిమాపై ఈ తాజా రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: