అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా చేస్తున్న రెండో సినిమా హలో. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నాగార్జున నిర్మాణంలో వస్తుంది. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువయ్యిందని తెలుస్తుంది. విక్రం కుమార్ విజన్ కు అఖిల్ అడ్డుపడుతున్నాడట.


ఈ తరహా వ్యవహారం అఖిల్ కు కొత్తేమి కాదు.. హీరోగా తన మొదటి సినిమా అఖిల్ లో కూడా వినాయక్ ను సరిగా పనిచేయనివ్వడంలేదని అన్నారు. ఇప్పుడు అదే సీన్ హలో సినిమా విషయంలో రిపీట్ అవుతుందని అంటున్నారు. యాక్షన్ సీన్స్ లో సాంగ్స్ లో అఖిల్ వేలు పెట్టుడు ఎక్కువయ్యిందట. 


ఈ విషయం పై విక్రం నాగార్జునకు కంప్లైంట్ చేసినా సరే లాభం లేదని తెలుస్తుంది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సినిమా రిజల్ట్ మీద చూపిస్తుందని అంటున్నారు. కుర్ర హీరోగా తన సత్తా చాటాలని చూస్తున్న అఖిల్ హలో ఏం చేస్తాడో చూడాలి. షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చిందని తెలుస్తుంది. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అఖిల్ కు హిట్ కిక్ ఇస్తుందేమో చూడాలి.


అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ హలో సినిమాకు కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో కచ్చితంగా అఖిల్ అలరిస్తాడని అంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: