శ్రుతి హాస‌న్‌కు ఎదుర‌యిన ఈ వింత అనుభూతికి ఆనందించాలో, దుఃఖించాలో అర్ధం కావ‌డంలేదు. డి-డే, రామ‌య్యా..వ‌స్తావ‌య్యా మూవీల‌తో శ్రుతిహాస‌న్ ఫిల్మ్ కెరీర్ ఓ రేంజ్‌లో ట‌ర్న్ అవుతుంది. ఇప్పుడు శ్రుతి ఒప్పుకోవాలే కాని త‌న‌తో నెల‌కో మూవీను తెర‌కెక్కించటానికి ప్రొడ్యూజ‌ర్లు,ద‌ర్శకులు రెడీ అంటున్నారు.

బాలీవుడ్ దూకుడు హీరో అక్కితో జ‌త క‌ట్టిన శృతికు మరో ల‌క్కు క‌లిసివ‌చ్చింది. అక్షయ్‌కుమార్,శృతిహాస‌న్ జంట‌గా గ‌బ్బర్ అనే మూవీను మ‌న తెలుగు డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్షయ్‌కుమార్ రిక‌మెండ్‌తో శృతి మ‌రో ఆఫ‌ర్‌ను చేజిక్కించుకుంది. స‌ల్మాన్‌ఖాన్‌తో గోవా బ్యూటి ఇలియాన ఒక మూవీ చేసే అవ‌కాశం ఉందంటూ బాలీవుడ్‌లో న్యూస్ వినిపిస్తుంది. రామ‌య్యా..వ‌స్తావ‌య్యా. మూవీలో శృతి పెర్ఫామెన్స్‌ను చూసిన కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌, ఇలియాను త‌ప్పించి శృతిహాస‌న్‌ను ఓకే చేసిన‌ట్టు స‌మాచారం.

ప్రస్తుతం మెంట‌ల్ షూటింగ్‌లో బిజిగా ఉన్నా స‌ల్లూభాయ్‌, 2014 ఎండింగ్‌లో మ‌రో ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకువెళ్ళనున్నాడు. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ అని ఈ బేబి స్ట్రాంగ్‌గా న‌మ్ముతుంది. ఇదిలా ఉంటే శృతికు ఈ మ‌ధ్యకాలంలో ఓ ప్రొడ్యూజ‌ర్ భారి మొత్తంలో మ‌నీను ఆఫ‌ర్ చేసి, ఓ రొమాంటిక్ మూవీలో యాక్ట్ చేస్తావా అంటూ అడిగాడ‌ట‌. దీంతో ఒళ్ళు మండిన శృతి నేను బూతు హీరోయిన్‌ను కాదు, మ‌రొక‌రిని పెట్టుకో అంటూ కోపంతో ఊగిపోయింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: