మహేష్ బాబు అనగానే మొదటగా గుర్తొచ్చేది, అబ్బాయిలుఈర్ష్యపడే ,అమ్మాయిలు తలపక్కకు తిప్పకుండా ఆద్యంతం చూడాలనుకునే అందం మరియు ఆరడుగుల హైట్ .సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో,ఆయన వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో మిల్క్ బాయ్ గా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు .తన అందంతో హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడంటే అది అతిశయోక్తి కాదు .అందుకే మహేష్ కు అభిమానుల కొదువే లేదు . అందులోనూ అమ్మాయిల ఫాలోయింగ్ అయితే చెప్పనవసరంలేదు.అతను అమ్మయిల కలల రాకుమారుడు.ప్రతీ ఒక్క అమ్మాయి మహేష్ బాబు లాంటి అందమైన భర్తగా రావాలని కోరుకుంటుంది.


కాగా 2017 వ  సంవత్సరం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం స్పైడర్.ఒక స్టార్ డైరెక్టర్ మరియు ఒక సూపర్ స్టార్ కాంబినేషన్లో సినిమా అంటేనే అభిమానులందరూ  భారీ  అంచనాలకి వస్తారు కానీ ఈ సినిమా మాత్రం అభిమానుల అంచనాలను తలక్రిందులు చేసేసింది. విడుదలయిన రోజు నుండి నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తన ప్రభావాన్ని  చూపించలేకపోయింది.అయితే ఈ సినిమాకు లభించిన కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే .ప్రస్తుతం మహేష్ ఒక విభిన్న కథతో మన ముందుకు రానున్నాడు.


శ్రీమంతుడుతో మహేష్ కెరీర్లోనే పెద్ద హిట్ ఇచ్చిన కొరటాల దర్శకత్వంలో ఈ సంవత్సరం వేసవికి భరత్ అనే నేను అనే సినిమాతో సందడి చేయనున్నాడు.నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిఉంది.కానీ పవన్ ,బాలయ్య చిత్రాల నేపథ్యంతో ఈ వేసవికి దీన్ని వాయిదా వేయడం జరిగింది .ఈ సినిమాలో    మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడంతో అసలు సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆతృత అభిమానులలో పెరిగిపోతుంది .


అయితే ఈ సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపినా ఇప్పట్లో అది విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు.ఎందుకంటే రాజకీయ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా హైదరాబాద్ లో ఇంకా షూటింగ్  జరుగుతుండటమే కారణం.రేపే ఫస్ట్ లుక్ విడుదవ్వాల్సినప్పటికీ చిత్ర బృందం నుండి ఎటువంటి హంగు ఆర్భాటం లేకపోవడంతో బహుశా రేపు విడుదల కాకపోవచ్చేమో అని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.కాగా ఈ చిత్రంపై అభిమానులు తయారు చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు యిప్పటికే సోషల్ మీడియాలో  దర్శనమిస్తున్నాయి.ఏదీ ఏమయినప్పటికి రేపు సర్ ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారో లేక నిజంగానే వాయిదా వేస్తారో తెలుసుకోవాలంటే రేపటివరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: