టాలీవుడ్ లో స్టార్స్ ఎంతమంది ఉన్నా స్టార్ హీరోయిన్స్ మాత్రం కొంతమందే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామలు స్టార్ క్రేజ్ సంపాదించాలంటే వారికి లక్ తప్పనిసరి. కుర్ర హీరో సినిమా అయినా, స్టార్ హీరో సినిమా అయినా ఆడియెన్స్ మనసులు గెలిస్తే ఆమె స్టార్ హీరోయిన్ అయినట్టే. ప్రస్తుతం అలాంటి ఫీచర్స్ కనబడుతున్న అమ్మడు రష్మిక.


కన్నడ కిర్రిక్ పార్టీ హీరోయిన్ గా ఓవర్ నైట్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో డెబ్యూ మూవీగా ఛలో సినిమా చేసింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా కథ పాతదే అన్న టాక్ ఉన్నా కథనంలో దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. 


ఇక సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక తన క్యూట్ లుక్స్ తో మంచి మార్కులు కొట్టేసింది. కార్తిక పాత్రలో అమ్మడి అభినయం అదరగొట్టింది. కొన్ని సీన్స్ లో హృదయాలను టచ్ చేసింది ఈ అమ్మడు. మొత్తానికి తెలుగులో మరో స్టార్ ఫీచర్స్ ఉన్న అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది సినిమా హిట్ లో తన ఇన్వాల్వ్ మెంట్ ఉండేలా చేసుకుంది.


ఏదో వచ్చాం చేశాం అన్నట్టు కాకుండా.. హీరోయిన్ గా స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టింది రష్మిక. అందుకే కాబోలు అమ్మడు డెబ్యూ అనగానే టాలీవుడ్ అంతా హడావిడి చేశారు. నిజంగా చెప్పాలంటే ఆమెకు ఇది పర్ఫెక్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు. ఎలాగు మొదటి సినిమా హిట్ కొట్టింది కాబట్టి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. మరి అమ్మడి టాలీవుడ్ కెరియర్ గ్రాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: