4100 కోట్లకు వారసుడైన ఒక యువకుడు తన సొంతంగా 30 లక్షలు సంపాదించడానికి తనకు తానుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పైగా యువకుడికి క్రికెట్ అంటే పిచ్చి. దీంతో ఆ యువకుడు. ఈ క్రమంలోనే తాను ఐపీఎల్ 11  ఆడాలని నిశ్చయించుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌ సీజన్‌ 11 టోర్నమెంట్‌ కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించారు కదా. ఈ వేలంలో కొందరు ఆటగాళ్లు భారీగా అమ్ముడు పోవడం జరిగింది, మరికొందరు తక్కువ ధరకు అమ్ముడు పోవడం జరిగింది. అయితే మరి కొందరు యువ ఆటగాళ్లు కూడా ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.


అందులో పైన చెప్పిన ఆ యువకుడు కూడా ఉన్నాడు. అతనే ఆర్యమాన్‌ బిర్లా. వయస్సు 20 సంవత్సరాలు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా కుమారుడు అతను. కొన్ని వేల కోట్లకు ఆస్తిపరుడైన ఆర్యమాన్‌ బిర్లాకు క్రికెట్ అంటే పిచ్చి. చిన్నతనం నుండే క్రికెట్ బాగా ఆడేవాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో రాణించాలి అని కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది.


ఆర్యమాన్‌ బిర్లా ఎడమ చేతివాటం బాట్స్ మెన్. మధ్యప్రదేశ్ జట్టులో ఆల్ రౌండర్ గా మంచి ప్రతిభను కనబరిచాడు. అండర్‌ 23 మధ్యప్రదేశ్‌ జట్టులో ఆడి 602 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ ఉన్నాయి. ఇక లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా 10 వికెట్లు కూడా తీశాడు. దీంతో ఐపీఎల్‌ టోర్నమెంట్‌ తలుపు తట్టాడు. అయితే తాజాగా జరిగిన ఐపిఎల్ వేలంలో ఆర్యమాన్‌ బిర్లా కనీస ధరను ఐపీఎల్‌ కమిటీ రూ.20 లక్షలుగా నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి రోజు జరిగిన వేలంలో ఇతన్ని ఎవరూ పట్టించుకోలేదు.


ఆర్యమాన్‌ కొంత నిరాశ చెందాడు. అయితే రెండో రోజు ఇతని పంట పండింది. రూ.30 లక్షలకు ఇతన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ టీం కొనుగోలు చేసింది. దీంతో ఆర్యమాన్‌ తెగ ఆనంద పడిపోయాడు. ఏదైనా ఒక టీం లో సెలెక్ట్ ఐతే చాలు అని అనుకొని వచ్చినా ఆర్యమాన్‌ రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులతో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఫైనల్‌ జట్టులో స్థానం దక్కుతుందనే ఆశతో ఆర్యమాన్‌ ఎదురు చూస్తున్నాడు. ఏదేమైనా క్రికెట్ భారతీయులను ఏదైనా చేపిస్తుంది ఎంతటివారినైనా అని మరోసారి రుజువైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: