టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ డైరెక్టర్ వివివిసత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ ‘అల్లరి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.   రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమయానికి కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చడు అల్లరి నరేష్.  ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించిన అల్లరి నరేష్ కి గత కొంత కాలంగా టైమ్ అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి. 
Related image
అయినా మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి అల్లరి నరేష్ కి పోటీగా కామెడీ హీరోగా సునీల్ ఎంట్రీ ఇచ్చినా..మనోడిక కూడా కొంత కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుంది.  ఈ మద్య ఓ యూట్యూబ్ చానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లరి నరేష్ ఒకప్పటి విలన్ రఘువరన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు మొదటి నుంచి రఘువరన్ యాక్టింగ్ అంటే ఇష్టం. రజనీకాంత్ పక్కనైనా ఆయన విలనే .. చిరంజీవి పక్కనైనా ఆయన విలనే .. చూడటానికి మాత్రం చాలా సన్నగా ఉంటాడు". 
Image result for raghuvaran villan
ఒకప్పుడు కండలు పెంచుకోని మీసాలు పెద్దగా ఉండి..గంభీరంగా ఉన్నవారే విలన్ గా చూసేవారని..శివ సినిమాలో రఘువరన్ విలన్ గా ఎంతో గొప్పగా నటించాడని అన్నారు. అప్పటి నుంచి ఆయన నటనను అభిమానించడం మొదలైంది. ఆయన అమ్మాయైతే పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఆయనను చూసిన దగ్గర నుంచి విలన్ కావాలని ఉండేది .. యాక్టింగ్ ఇనిస్టిస్ట్యూట్ లో ఎప్పుడూ కూడా నేను కామెడీ సీన్ చేసి చూపించలేదు. అలాంటిది కామెడీ హీరోగా మారానంటే నాకే ఆశ్చర్యంగా వుంది" అంటూ చెప్పుకొచ్చాడు


మరింత సమాచారం తెలుసుకోండి: