టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మామూలుగా ఒక సినిమాలో హీరో ఒకసారి ఒక క్యారక్టర్లో కనబడితేనే మాస్ ప్రేక్షకులకు మజా వచ్చేస్తోంది. అటువంటిది న్యాచురల్ స్టార్ అంటూ ప్రూవ్ చేసుకున్నాక..ఇప్పుడు మరోసారి తెరపై రెండుసార్లు రెండు క్యారక్టర్లలో కనిపిస్తాను అంటున్నాడు అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Image result for krishnarjuna yuddham nani
'కృష్ణార్జున యుద్దం'' సినిమా మనోడు రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా తాలూకు టీజర్ ఎప్పుడొస్తుందో ఇప్పుడు అఫీషియల్ గా తెలిసిపోయింది.   ''కృష్ణార్జున యుద్దం'' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తుంటే..నాని ఒక ప్రక్కన క్లాస్ కుర్రాడిగా.. మరోప్రక్కన మాస్ రాయలసీమ పిల్లోడిగా.. కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. 
Image result for krishnarjuna yuddham nani
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఓ రెండు పాటలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా 'దారి చూడు దుమ్ము చూడు మామ' అనే పాట ఉర్రూతలూగిస్తోంది.  ఓ పక్క మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ‘భరత్ అనే నేను’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.  సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించిన సాంగ్స్ రిలీజ్ చేస్తూ..సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుతున్నారు.
Related image
ఇప్పుడు నాని కూడా తన సాంగ్స్ రిలీజ్ చేస్తూ..కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మొత్తానికి వరుస హిట్లతో ఊపుమీదున్న నాని.. ఇప్పుడు మరోసారి అదే ఊపుతో ఏ మాత్రం డిలే చేయకుండా వచ్చేస్తున్నాడనమాట. మరి డబుల్ యాక్షన్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇప్పుడు కృష్ణార్జున యుద్దం కూడా మార్చి 10న పొద్దున్న 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: