ప్రముఖ హీరోలు ప్రభాస్, దగ్గుబాటి రానాలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. హైటు, పర్సనాలిటీల్లో ఒకరికొకరు తీసిపోని ఈ హీరోలు కొట్టుకుంటుంటే చూసే వారి గుండెలు అదిరిపోతున్నాయట, అంతే కాదు ఈ కొట్టుడుకు బాక్సాఫీస్ బద్దలవుతుంది అంటున్నారు సినిమా వర్గాలు.

విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన డైరెక్టర్ రాజమౌళి తన డైరెక్షన్ లో వస్థున్న ‘బాహుబలి’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభించాడు. ఈసినిమాలో ఉన్న ప్రభాస్, రానాల మద్య ఉన్న ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరిస్థున్నారు.

చూసేందుకు సింహాల్లా కనిపించే ఈ ఇద్దరు హీరోలు చేతిలో వెపన్లతో చేస్థున్న ఫైట్స్ ప్రేక్షకుల గుండెలను అదరగొట్టడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. మరో రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా ఉంటుందని చెప్పాయి సినిమావర్గాలు. ప్రభాస్, రానాతో పాటు అనుష్క, అద్విసేన్, సత్యరాజ్ లు ప్రధానపాత్రలుగా నటిస్థున్న ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్టు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్థం చేసింది సినిమా యూనిట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: