Star cast: KaushikKamalinee MukherjeeNagarjuna Akkineni
Producer: Jayasri DeviDirector: J K Bharavi

Jagadguru Adi Shankara - English Full Review

జగద్గురు ఆదిశంకర రివ్యూ: చిత్రకథ 
మెగాస్టార్ చిరంజీవి ఆదిశంకరాచార్యులు గొప్పదనం గురించి చెప్పడం మొదలు పెట్టడంతో సినిమా మొదలవుతుంది. ఆదిశంకరాచార్యులు ఊహతెలిసిన నాటి నుంచి సన్యాసిగా మారాలని అనుకుంటాడు. ఆ విషయంలో అగ్ని దేవుడు(తనికెళ్ళ భరణి), రుద్రాక్ష ఋషి(మోహన్ బాబు), శ్రీహరి సాయపడతారు. ఆదిశంకరాచార్యులకి కాశీలో చండాలుడి(నాగార్జున) మంచి చెడులు నేర్పడానికి కొన్ని పరిక్షలు పెడతాడు.

ఇదిలా ఉండగా దేశంలో కులం మతం అని కొట్టుకుంటూ ఉంటే ప్రజలకు అసలు ప్రపంచం అంతా ఉన్నది ఒక్క శివోహం మాత్రమే అని ఆదిశంకరాచార్యులు చాటి చెప్పాలనుకుంటాడు. అప్పుడే స్వార్ధ పరుడైన కపాల మార్తాండ రాజు(సుమన్) ఏం చేసినా కాశీలోని సర్వజ్ఞ పీఠం అధిరోహించాలనుకుంటాడు. అప్పుడే ఆదిశంకరాచార్య - మార్తాండ రాజుకి మధ్య వైరం మొదలవుతుంది. అలాంటి సమయంలో గంగాదేవి(మీనా) మదన మిశ్రుడు(సాయి కుమార్)కి ఉన్న అజ్ఞానాన్ని తొలగించమని ఆదిశంకరాచార్యులని కోరుతుంది. అప్పుడు మదన మిశ్రుడు భార్య(కమలినీ ముఖర్జీ) అడ్డుతగలడం వల్ల ఆదిశంకరాచార్యులు గంగాదేవి కోరికను నేరవేర్చలేకపోవడంతో ఓ నిర్ణయం తీసుకుంటాడు. దాంతో కథలోకి అమరేంద్ర రాజు(శ్రీ రామచంద్ర), అతని భార్య (కామ్న జఠ్మలాని) ప్రవేశిస్తారు. అసలు ఆదిశంకరాచార్యులు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఈ ఒక్క నిర్ణయం వల్ల అమరేంద్ర రాజు- అతని భార్య అసలు కథలోకి ఎందుకు వచ్చారు? చివరికి సర్వజ్ఞ పీఠం ఎవరికి దక్కింది? అనే ఆసక్తి కరమైన భక్తి రసాన్ని తెరపైనే చూడాలి.

జగద్గురు ఆదిశంకర రివ్యూ: నటీనటుల ప్రతిభ
ఈ సినిమాలో పరమశివుని అవతారంగా చండాలుడి పాత్రలో నాగార్జున కనిపించేది కాసేపే అయినప్పటికీ కనిపించినంత సేపు అద్భుతమైన నటన కనబరిచాడు. ఆదిశంకరాచార్యులుగా సినిమాలో ఎక్కువ భాగం కనిపించిన కౌశిక్ కొన్ని సీన్స్ బాగా చేసిన కొన్ని కీలక సన్నివేశాల్లో సన్నివేశానికి తగ్గ స్థాయిలో నటన కనపడలేదు. డా. మోహన్ బాబు, శ్రీ హరి నటన పతాక సన్నివేశాల్లో అందరినీ అబ్బుర పరుస్తుంది. సాయి కుమార్, మీనా, రోజా కమలినీ ముఖర్జీ, సుమన్, కామ్న జఠ్మలాని వారి పాత్రలకు న్యాయం చేసారు. శ్రీ రామచంద్రకి చాలా కీలకమైన పాత్రే అయినప్పటికీ ఆ పాత్రకి న్యాయం చేయలేకపోయాడు.

జగద్గురు ఆదిశంకర రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

కథ కథనం మాటలు దర్శకత్వం నాలుగు విభాగాలను భుజాల మీద మోసిన జె కె భారవి కథ మీద చేసిన పరిశోధన మరియు మాటల్లో ఉన్న అర్ధం చాలా బాగున్నాయి కాని కథనం విషయంలో ఆయన మరింత జాగ్రత్త వహించాల్సింది. అది శంకరుడి గురించి తెలుసుకున్న మొత్తం చుపెత్తలన్న ప్రయత్నంలో కథనం వేగం తగ్గుతుందన్న విషయాన్ని గమనించ లేకపోయారు ఇక చివరగా దర్శకత్వం విషయంలో రాఘవేంద్ర రావు గారు ఒక స్థాయిని నిర్ణయించారు మరి ఆ స్థాయిలో సగం కూడా చేరుకోలేకపోయారు. నాగ శ్రీ అందించిన సంగీతం చిత్రానికి బలహీనం కాలేదు కాని బలం చేకూర్చలేకపోయింది. ఇక ఎడిటర్ కొన్ని సన్నివేశాలను కత్తరించి ఉండాల్సింది.


జగద్గురు ఆదిశంకర రివ్యూ: హైలెట్స్
  • స్టొరీ లైన్ మరియు డైలాగ్స్
  • చండాలుడిగా నాగార్జున సూపర్బ్ పెర్ఫార్మన్స్
  • ఆదిశంకరాచార్యగా కౌశిక్ నటన, రుద్రాక్ష ఋషిగా మోహన్ బాబు నటన బాగుంది.
  • శ్రీ మంజునాథ సినిమా నుంచి వాడుకున్న చిరంజీవి తాండవం..

జగద్గురు ఆదిశంకర రివ్యూ: డ్రా బాక్స్
  • గ్రాఫిక్స్
  • యువతని ఆకట్టుకోలేకపోవడం

జగద్గురు ఆదిశంకర రివ్యూ: విశ్లేషణ

అన్నమయ్య, శ్రీ రామదాసు మరియు షిరిడి సాయి చిత్రాలు విజయం సాదించడంతో జె కె భారవి ప్రజల్లో మంచి పేరుని సంపాదించుకున్నారు. ఆ చిత్రాలకు రచయితగా చేసిన భారవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ చిత్రం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమయినా ఉందంటే అన్నమయ్య చరిత్ర, రామదాసు చరిత్ర మరియు షిరిడి సాయి తెలిసినంతగా ఆదిశంకరుడు తెలియదు అంతే కాదు ప్రస్తుత యువతకు ఆయన్ని పరిచయం చెయ్యాలన్న భారవి ప్రయత్నం సరైనదే కానీ చిత్రీకరణ కూడా ఆ స్థాయిలో ఉండాల్సింది. ఇక ఇలాంటి చిత్రానికి వెన్నముక లాంటి గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉండటంతో సన్నివేశంలో ఉన్న ఫీల్ ని తెర మీదకి తీసుకురాలేకపోయారు. పోస్టర్ లలో నాగార్జునని చూపించి పబ్లిసిటీ చేస్తున్నారు కాని అయన చిత్రంలో పది నిముషాలు కూడా ఉండరు అలానే మోహన్ బాబు, నాగబాబు మరియు పోసాని వంటి వాళ్ళు ఉన్నా స్థాయికి తగ్గట్టుగా దర్శకుడు ఉపయోగించకోలేకపోయాడు అనిపిస్తుంది. ఈ చిత్రంలో మాస్ అంశాలను ఆశించడం సరైన పని కాదు కాని యువతను లక్ష్యంగా చేసుకొని తెరకెక్కించామని చెప్పుకుంటున్న నిర్మాతలు ఈ చిత్రం యువతను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారో తెలియట్లేదు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జె కె భారవి చేసిన పరిశోధన మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. నిజానికి ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు టివి సీరియల్ చూస్తున్న భావన కలుగుతుంది నాసిరకమయిన గ్రాఫిక్స్ స్లో పేస్ స్క్రీన్ ప్లే తో ఇటు లక్ష్యంగా చేసుకున్న యువతకి నచ్చక అటు మాస్ ప్రేక్షకులను మెప్పించక ఈ చిత్రం ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. ఒకవేళ మీకు అది శంకరుడి గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ చిత్రం మీకోసమే .....


జగద్గురు ఆదిశంకర రివ్యూ: చివరగా
జగద్గురు ఆదిశంకరాచార్య - యువత కోసమే కానీ ...
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Jagadguru Adi Shankara | Jagadguru Adi Shankara Wallpapers | Jagadguru Adi Shankara Videos

మరింత సమాచారం తెలుసుకోండి: