ఈ మద్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీరెడ్డి ఇంటర్వ్యూలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  సినిమా పూర్తిగా బ్రస్టు పట్టిపోయిందని.. టాలీవుడ్‌లో ఉన్న చీకటి భాగోతాన్ని బయటపెట్టిన నటి శ్రీరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  కొంత మంది హీరోలు, దర్శకులు తాము వాడుకోవడమే కాకుండా రాజకీయ నాయకుల వద్దకు కూడా బలవంతంగా పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొంత మంది నటీమణులు సీరియస్ అవుతున్నారు. 
Image result for sri reddy
తన పబ్లిసిటి కోసం ఛీఫ్ ట్రిక్స్ చేస్తూ..ఇండస్ట్రీలో హీరోయిన్లపై చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని వాదిస్తున్నారు.  తాజాగా నటి శ్రీరెడ్డిపై భూత్ బంగ్లా మూవీ దర్శకుడు అజయ్ కౌండిన్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే వీరిద్దరి మద్య మాటల యుద్దం నడుస్తున్న నేపథ్యంలో మరోసారి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ మద్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యుసర్లను బ్రోకర్లుగా అభివర్ణిస్తూ శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్‌పై మండి పడ్డారు కౌండిన్య.  సినిమా ఇండస్ట్రీలో నిన్ను ఇబ్బంది పెడితే.. నీకు ఇష్టం లేకపోతే మొదట్లోనే వెళిపోవచ్చు కదా? బయట జాబ్ చేసుకోవచ్చుకదా అన్నారు.
Image result for sri reddy
ఓ సినిమా తీయడంలో నిర్మాత పడే కష్టం నీకు తెలుసా? అన్నారు. తమన్నాని పెట్టుకుంటారు.. ఇంకో హీరోయిన్‌ని పెట్టుకుంటారు అంటున్నావ్.. వాళ్లను పెట్టుకుంటేనే నిర్మాతకు నాలుగు డబ్బులు వస్తాయ్.. నిన్ను పెట్టుకుంటే ఎవడు చూస్తాడు? నువ్ ఎవరికి తెలుసు? నువ్వే చెప్తున్నావ్ నేను పోర్న్ స్టార్ అని అలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని అన్నారు.  అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నాకు లీడ్ క్యారెక్టర్ కావాలని అడగడానికి నువ్ ఎవరివి అసలు? ఓ పాత్రకు ఎవర్ని పెట్టుకోవాలో అది దర్శకుడి ఇష్టం ఉండదని అన్నారు.
Image result for sri reddy
ఏ నిర్మాతకు డబ్బులు ఎక్కువైన సినిమాలు తీయరు..ఆ సినిమాపై ఎంతో మంది ఆధారపడి ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. నిన్ను వాడుకున్నారని అంటున్నావే..మరి వాళ్లు పెట్టిన ఫుడ్ తిన్నావ్.. వాళ్లతో పబ్‌లకు వెళ్లావ్.. వాళ్ల కార్లలో తిరిగావ్... ఫారిన్ ట్రిప్స్‌కి వెళ్లావ్.. కార్లు గిఫ్ట్ ఇస్తే తీసుకున్నావ్... పదిహేనేళ్లుగా వాళ్లు ఏమిస్తే అన్నీ తీసుకున్నావ్ ఇప్పుడు వాళ్లని రోడ్డు మీద పెట్టేస్తావా? అంటే నువ్వ ఎంజాయ్ చేయడానికి వాళ్లు పనికి వస్తారు..తేడా వస్తే..వారు నీకు శత్రువులు అవుతారా అని ప్రశ్నించాడు.

నీకు ఇప్పటి వరకూ ఏ దర్శకుడు ఇవ్వని బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. శ్రీరెడ్డికి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆమెతో జీఎస్టీ 2 తీస్తా.. నేషనల్ అవార్డ్ వచ్చే కత్తిలాంటి స్టోరీ నా దగ్గర ఉంది. ఆ క్యారెక్టర్ కోసం హీరోయిన్‌ని వెతుకుతున్నా.. కరెక్ట్ టైంకి కరెక్ట్ సబ్జెట్జ్‌కి నువ్ దొరికావ్.. ఆ సినిమా పేరు ‘జీఎస్టీ 2’ ఈ సినిమాలో నటించడానికి మీరు రెడీ అయితే చెప్పండి... మీకు ఎంత డబ్బుకావలిస్తే అంత నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని సంచలన ఆరోపణ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: