టాలీవుడ్ లో అజ్ఞాతవాసి దెబ్బతో.. షాక్ తిన్న డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సినిమా స్టోరీ రివర్స్ గేర్ వేయడంతో తన పెన్ పవర్ పై డౌట్స్ రైజ్ అయ్యాయి. త్రివిక్రమ్ స్టోరీస్ లో ఘాటు తగ్గిందనే కామెంట్స్ వినిపించాయ్. అందుకే తన నెక్స్ట్ మూవీని తెరకెక్కించే ముందు కొత్త ఫార్ములాతో తన సత్తాని టెస్ట్ చేసుకోబోతున్నాడు. నితిన్ హీరోగా తెరకెక్కించిన ఛల్ మోహన్ రంగ మూవీకి స్టోరీ అందించి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే త్రివిక్రమ్ జాతకం నితిన్ సినిమా రిజల్ట్ పైనే ఆధారపడి ఉంది..

Image result for chal mohana ranga

నితిన్ హీరో గా తెరకెక్కిన ఛల్ మోహన్ రంగ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, పవన్ సమర్పకుడు. కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ట్రయిలర్ లోనే పడిన రెండు మూడు డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గుర్తుకు తెచ్చాయి. సినిమాలో ఇది మరి కాస్త ఎక్కువే వున్నట్లు తెలుస్తోంది.

Image result for chal mohana ranga

సినిమాలో డైలాగ్ కామెడీ ఎక్కువగా వుందని.. ఆ ప్రాసలు ఆ పంచ్ లు త్రివిక్రమ్ స్టయిల్ ను గుర్తుకు తెస్తాయని వినిపిస్తోంది. త్రివిక్రమ్ లవ్ సబ్జెక్ట్ ను డీల్ చేసి చాలా కాలమైంది. అ..ఆ సినిమాలో ప్రేమ కన్నా పట్టింపులు ఎక్కువగా కనిపిస్తాయి. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందు కన్నా, రచయితగా వున్నపుడే యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ లు ఎక్కువగా అందించాడు. మళ్లీ ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణ చైతన్యకు అలాంటి లైన్ ను త్రివిక్రమ్ అందించి డెవలప్ చేయించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పూరిత భావోద్వేగాలు, ఆ తరహా డైలాగులు కాస్త ఎక్కువే వున్నాయని వినికిడి.

Image result for chal mohana ranga

ఎలా చూసినా అజ్ఞాతవాసి తెచ్చిన బ్యాడ్ నేమ్ నుంచి త్రివిక్రమ్ త్వరగా బయట పడాలి అంటే ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వాలి. స్టోరీలో కూడా త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపించాలి. ఇలా రెండు వర్కవుట్ అయితే త్రివిక్రమ్ తిరిగి గాడిలో పడినట్టే.. ఏమాత్రం రివర్స్ అయినా తిరిగి ఆలోచించాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి: