రంగస్థలం ఈ మద్య రిలీజ్ అయిన సినిమా ల లో ప్రేక్షకలను ఒక ఊపు ఊపిన సినిమా గా చెప్పుకోవచ్చు. సుకుమార్ ఈ సినిమా ను అద్బుతంగా తీసాడని చెప్పవచ్చు. రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. అభిమానులనే సంభందం లేకుండా ఈ సినిమా అందరిని అలరించింది. దీనితో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Image result for ram charan rangasthlam
అలాగే కలెక్షన్ ల విషయం లో కూడా రికార్డు లు నెలకొల్పుతుంది. ప్రస్తుతం రంగస్థలం చిత్రానికి వస్తున్న కలెక్షన్ల జోరు చూస్తుంటే మరో 4 రోజుల్లో రూ. 150 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే  మగధీర, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, జై లవ కుశ, సరైనోడు చిత్రాల రికార్డులన్నీ బద్దలు కానున్నాయి.
Image result for ram charan rangasthlam
టాలీవుడ్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 2 మూవీ రూ. 1706.50 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రూ. 600 కోట్ల వసూళ్లతో బాహుబలి రెండో స్థానంలో ఉంది. రూ. 164 కోట్ల వసూళ్లతో ‘ఖైదీ నెం 150' చిత్రం మూడో స్థానంలో ఉంది. రంగస్థలం చిత్రం రూ. 150 కోట్ల మార్కును అధిగమిస్తే టాలీవుడ్లో టాప్ 4వ గ్రాసర్‌గా ‘రంగస్థలం' మూవీ రికార్డుల కెక్కనుంది. అయితే మెగాస్టార్ ఖైదీ నెం 150 రికార్డును టచ్ చేస్తుందా? లేదా? అనేది వచ్చే వారానికికానీ అంచనా వేయలేం. 


మరింత సమాచారం తెలుసుకోండి: