నాన్ బాహుబలి రికార్డ్స్‌లో నంబర్ వన్ పొజిషన్ దిశగా దూసుకెళ్తోంది ‘రంగస్థలం’. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు సాధించిన వసూళ్లను మినహాయిస్తే.. మిగతా తెలుగు సినిమాల వసూళ్లలో టాప్ పొజిషన్‌కు చేరుకునేలా ఉంది రామ్ చరణ్ సినిమా. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుంది.ఇప్పటికే ‘రంగస్థలం’ షేర్ వసూళ్ల విషయంలో వంద కోట్ల రూపాయల మొత్తానికి దగ్గరవుతోంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు 175కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. దీంతో బాహుబలియేతర సినిమాలలో టాప్-1గ్రాసర్‌గా ‘రంగస్థలం’ నిలిచింది.
Image result for rangasthalam stills
1980లో పల్లెటూరి రివేంజ్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించిన విధానానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు., ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోయడంతోనే ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తెలుగు సినిమా చరిత్రలో టాప్ వసూళ్ల సినిమాల జాబితాను పరిశీలిస్తే, వాటిల్లో మూడో స్థానానికి చేరువవుతోంది రంగస్థలం. తొలి రెండు స్థానాల్లో బాహుబలి 2, బాహుబలి సినిమాలున్నాయి.
Image result for rangasthalam stills
ఇప్పటి వరకూ మూడో స్థానంలో మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ 150’ ఉంది. ఇప్పుడు చిరు సినిమా వసూళ్ల రికార్డులను చరణ్ సినిమా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వారంలో నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’ వచ్చింది..ఈ వారం ‘కృష్ణార్జునయుద్ధం’ ఈ రెండూ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రాంచరణ్ కి అడ్డు లేకుండా పోయింది.    ‘రంగస్థలం’కు తగిన పోటీ ఇచ్చే సినిమాలు ప్రస్తుతానికి లేనట్టే.
Image result for rangasthalam stills
వచ్చే వారంలో మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ విడుదల అయ్యేంత వరకూ ‘రంగస్థలం’కు ఎదురు లేకపోవచ్చు. ఆ లోపు ఈ సినిమా ‘ఖైదీ 150’ వసూళ్ల మార్కును అధిగమించేసి, నాన్ బాహుబలి రికార్డ్స్ లో నంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో  రామ్ చరణ్ సరసన సమంత నటించగా.. ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రోహిణి, నరేశ్, జబర్ధస్త్ మహేశ్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: