విషయం ఏదైనా సరే.. టాపిక్ ఎక్కడున్నా సరే.. స్పందించాల్సింది పవన్ కళ్యాణే అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ తన స్పందన తెలియచేస్తే దాన్ని తప్పుగా అర్ధం చేసుకుని బూతులు తిట్టేస్తున్నారు. ఓ పబ్లిక్ ఫిగర్ అది కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో.. అందునా పొలిటికల్ పార్టీ పెట్టి నాయకుడిగా మారాడు కాబట్టి అతని మీద అందరి కన్ను.


కొన్నాళ్లు ఆయన ఫ్యాన్స్ తనని ట్రోల్ చేశారంటూ కత్తి మహేష్ హంగామా సృష్టించాడు. అతని ఫ్యాన్స్ ప్రత్యక్ష దాడి (గుడ్లతో) చేయడంతో సైలెంట్ అయ్యి రాజీకి వచ్చాడు. అయితే రాజకీయ పరంగా పవన్ మీద కత్తి ఇంకా తన ప్రశంసలను సంధిస్తూనే ఉన్నాడు. ఇక మరోపక్క కాస్టింగ్ కౌచ్ మీద శ్రీరెడ్డి యుద్ధం చేస్తుంది.  


ఆమె లేవనెత్తిన అంశం మంచిదే అయినా తను చేస్తున్న విధానం మీద అందరు అసంతృప్తిగా ఉన్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న బూతు బాగోతం గురించి ఆమె నిరసన వ్యక్తం చేస్తుండటం మంచి విషయమే అయితే రీసెంట్ గా పవన్ కళ్యాన్ ను అతని తల్లిని దూషించడం మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. 


అయితే వీరంతా పవన్ ను తిడితే పబ్లిసిటీ వస్తుందని కొందరంటున్నారు. పవన్ ను దూషించి పబ్లిసిటీ పెంచుకుందాం అనుకుంటున్నారు కాని వీరి తెలియని మరో విషయం ఏంటంటే ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల పవన్ కు ఇంకా సపోర్ట్ పెరుగుతుంది తప్ప వారు అనుకున్నది మాత్రం సాధ్యపడదు. ఆత్మ విమర్శ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి అది నిరసన అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మరి ఈ విషయం ఎలా ముగిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: