మిగతా హీరోలంత మిలియన్ డాలర్లు, ఇండస్ట్రీ రికార్డులను దూసుకెళ్తుంటే ఎప్పుడో మగధీర టైం లో ఇండస్ట్రీని షేక్ చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు రాం చరణ్. మెగా ఫ్యాన్స్ ను అలరించే సినిమాలు హిట్ మార్క్ దాటేలా వస్తున్నా మెగా తనయుడిగా తన ముద్ర వేసుకునే సినిమా కోసం అటు ఫ్యాన్స్ ఇటు సిని జనాలు ఎదురుచూశారు.


ధ్రువతో ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దాటేసి హమ్మయ్య అనిపించగా ఇక సుకుమార్ రంగస్థలం తో చరణ్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబు సుక్కు కథ రాసుకున్నప్పుడు ఏం ఊహించుకున్నాడో తెలియదు కాని చరణ్ మాత్రం చిట్టిబాబుగా విశ్వరూపం చూపించేశాడు. 


మార్చి 30న రిలీజ్ అయిన రంగస్థలం ఇప్పటికి వసూళ్ల లెక్కల గురించి మాట్లాడుకునేలా చేసింది. కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని అభిమానులను సైతం తన నటనతో ఆకట్టుకున్నాడు రాం చరణ్. అందుకే ఈరోజుకి ఆ సినిమా వసూళ్ల హవా కొనసాగిస్తుంది. మహేష్ భరత్ అనే నేను ఓ పక్క హిట్ టాక్ తో నడుస్తున్నా రంగస్థలం మే 1 నాటికి 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. 


కరెక్ట్ సినిమా పడితే కాని రాం చరణ్ అసలు సిసలు స్టామినా ఏంటో తెలియలేదని చెప్పొచ్చు. చరణ్ ఈ సక్సెస్ మజాని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటు నటిస్తున్నాడు. చూస్తుంటే మెగా పవర్ స్టార్ క్రేజీ టైం స్టార్ట్ అయినట్టుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: