త‌ను ఏం చేస్తుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. అంద‌రూ రౌండ‌ప్ చేసి ఆమెను క‌న్‌ఫ్యూజ్ చేశారు. చివ‌ర‌కు ఒంటరిగా మిగిలిపోయింది. త‌నే ప్రియ‌మ‌ణి. పైళ్ళైన కొత్తలో మూవీతో జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చిన ప్రియ‌మ‌ణికు జ‌గ‌ప‌తిబాబే టాలీవుడ్ టాప్ హీరో అనుకుంది. అందుకే పెద్ద హీరోల‌తో అవ‌కాశం వ‌చ్చినా, ఎక్కువ మూవీల‌ను జ‌గ‌ప‌తి బాబుతోనే చేసింది. పెద్ద హీరోల‌తో ఆఫ‌ర్స్ వ‌చ్చినా కాల్షీట్లు బిజి అంటూ జ‌గ‌ప‌తి బాబుతోనే స‌ర్వస్వం అనుకుంటుంది. తీరా చూస్తే ఆ మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద చతికిల ప‌డ‌టం, ప్రియ‌మ‌ణికు ఆఫ‌ర్లు మిస్ అవ‌డంతో ఈ లోపు కొత్త హీరోయిన్స్ ఇండ‌స్ట్రీలోకి దూసుకువ‌చ్చారు.

ప్రియ‌మ‌ణి ఖాళీగానే ఉంది క‌దా అని లీడ్‌రోల్స్ ఉన్న సినిమాలను సింగిల్‌గానే లాగించేశారు కొంద‌రు నిర్మాత‌లు. అవి కూడ బాక్సాపీస్ వ‌ద్ద కాసులు కురిపించ‌క పోవ‌డంతో ఈ బ్లాక్ బ్యూటీ ఫిల్మ్ కెరీర్ డైల‌మాలో ప‌డింది. లేటెస్ట్‌గా వ‌చ్చిన చండీ మూవీ రిలీజ్‌కు ముందే ప్లాప్ టాక్‌ను కైవ‌సం చేసుకుంది. తాజాగా రిలీజ్ అయిన చంఢీ టీజ‌ర్‌లో ప్రియ‌మ‌ణి చేత బూతు డైలాగుల‌ను చెప్పించారు. నాతో పెట్టుకుంటే బాక్స్ బ‌ద్దల‌వుతుంది, క‌ట్ చేస్తే ప‌నికిరాకుండా పోతావ్ అనే బోల్డ్ డైలాగ్‌లు ప్రియ‌మ‌ణి నోటి వెంట వింటానికి కొంచెం ఎబ్చెట్టుగా మారాయి. ప్రియ‌మ‌ణికు వ‌చ్చిన క‌ష్టాలను చూసి సినిపెద్దలు కొందరి లైఫ్ అంతే అంటూ లైట్ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: