బాలీవుడ్‌లో ఖాన్‌ల గొడ‌వ మ‌ళ్ళీ మొద‌లైంది. ఎప్పుడు ఎవ‌రో ఒక‌రు గొడ‌ప‌డుతూనే ఉంటారు. ముఖ్యంగా షారుఖ్ అండ్ స‌ల్మాన్‌ల మ‌ధ్య ఈ గొడ‌వ కామ‌న్‌గా ఉంటుంది. చాలా సంవ‌త్సరాలగా వీరిద్దరి మాధ్య బాక్సీపీస్ హోరు జ‌రుగుతూనే ఉంటుంది. రీసెంట్‌గా వీరిద్దరూ ఓ ఈద్ పార్టీలో కౌగిలించుకొని ఆ దూరాన్ని త‌గ్గించుకున్నారు. అలా ద‌గ్గర‌య్యారో లేదో మ‌ళ్ళీ వీరి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతున్నాయి. ప్రతి సంవ‌త్సరం ఈద్ ఫెస్టివ‌ల్‌కు స‌ల్మాన్ బాక్సీపీస్‌ను షేక్ చేస్తాడు. వాంటెడ్‌,ద‌బాంగ్‌,బాడీగార్డ్ ఇలా వ‌రుస‌గా ఈద్ పండుగ‌ల‌కి బాక్సాపీస్ హీరోగా స‌ల్మాన్‌ఖాన్ నిలిచాడు. 

ఈ సంవ‌త్సరం మాత్రం స‌ల్మాన్‌ఖాన్‌కి ఈద్ పండుగ నాడు మూవీలు లేక‌పోయేస‌రికి, షారుఖ్ విజృంభించాడు. త‌న చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీతో క‌లెక్షన్ల తుఫాన్‌ని క్రియోట్ చేస్తున్నాడు. ఇప్పటికే 200 వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళని రాబ‌ట్టి 300 వంద‌ల కోట్లను అవ‌లీల‌గా ఛేజ్ చేస్తుంటే బాలీవుడ్ బ‌డా హీరోల‌ రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ సంవ‌త్సరం ఇలా ఉంటే వ‌చ్చే సంవ‌త్సరం ఈద్ ఫెస్టివ‌ల్‌కి స‌ల్మాన్‌ఖాన్ వ‌ర్సెస్ షారుఖ్‌ఖాన్ అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్స్‌. 2014 ఈద్‌కి వీరిద్దరి మ‌ధ్య గ‌ట్టి పోటీనే ఉంటుందంటున్నారు. దీంతో మ‌ళ్ళీ ఖాన్ మ‌ధ్య ఆధిప‌త్యపోరు మొద‌లైంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: