ఇండియన్ దిగ్గజ దర్శకుడు శంకర్ సృష్టించిన విజువల్ వండర్ రోబో 2.0 సినిమా ప్రేక్షకులకు ముందు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే శంకర్  ఒక్కపాట కోసం 20 కోట్లు ఖర్చు చేయించాడు. ఏకంగా 4 భారీ సెట్లు వేయించాడు. రెహ్మాన్ ను 2-3 రోజుల పాటు ఇబ్బందిపెట్టి మొత్తానికి ట్యూన్ సంపాదించాడు. హీరోహీరోయిన్లతో 10 రోజుల పాటు షూట్ చేశాడు. దాంట్లో మళ్లీ గ్రాఫిక్స్ కూడా చొప్పించాడు. ఇంత కష్టపడి తీసిన సాంగ్ ను రోలింగ్ టైటిల్స్ లో పెట్టాడు శంకర్. 

Image result for robo 2.0

అవును.. 2.0 సినిమాలో సూపర్ హిట్ అయిన యంతరలోకపు సుందరివే పాట ఎండ్-టైటిల్స్ లో వస్తుంది.  తెరపై మూడొంతలు మాత్రమే పాట కనిపిస్తుంది. కింద టైటిల్స్ పడుతుంటాయి. ఇంత ఖరీదైన పాటను సినిమాలో ఇలా వాడాడు శంకర్.  సాధారణంగా ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇలా పూర్తయిన వెంటనే ఆడియన్స్ అలా లేచి వెళ్లిపోతుంటారు. విదేశాల్లో ఉన్న మాదిరి శుభం కార్డు పడేవరకు సీట్లలో కూర్చోరు. 2.0కు అదే పెద్ద దెబ్బ అయింది. కథ సుఖాంతం అని తేలిన వెంటనే అంతా లేచి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైమ్ లో ఈ కాస్ట్ లీ సాంగ్ పెట్టాడు శంకర్.

Image result for robo 2.0 shankar

ఆల్రెడీ లేచిన వాళ్లు మొహమాటం కొద్దీ థియేటర్ల నుంచి వెళ్లిపోతుంటారు. అలా వెళ్లిన జనాల వల్ల మిగతా ప్రేక్షకులకు ఈ పాట కనిపించకుండా పోతోంది. అలా 20 కోట్ల పాట 2.0 సినిమాలో వృధా అవుతుంది. అయితే పాటను ఇరికించాలనే ఆలోచన పెట్టుకోకుండా, కేవలం కథ-స్క్రీన్ ప్లేకు కట్టుబడి శంకర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: