సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా ‘2.0’  భారీ అంచనాల మధ్య నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  శంకర్ రూపొందించిన సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు నటించారు. ఈ సినిమా ప్రీమియం టాక్ షో నుండి సాయంత్ర వరకు ఎక్కడ చూసినా పాజిటీవ్ టాక్ వచ్చింది. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  అయితే ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీకు గురికావడంతో చిత్ర యూనిట్ షాక్ కి గురైంది.

మద్రాస్ హైకోర్టు సీరియస్

ఈ సినిమా పైరసీకి గురి కాకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు హైకోర్టుని సంప్రదించగా.. దాదాపు 12 వేల వెబ్ సైట్లను బ్లాక్ చేసే విధంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.  అయినప్పటికీ ఈ సినిమా పైరసీకి గురికావడం బాధాకరం. తమిళ రాకర్స్ వెబ్‌సైట్ హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌ను అప్‌లోడ్ చేసింది. దాంతో లైకా ప్రొడక్షన్ చేసిన శ్రమ అంతా వృథా అయింది. ఈ నేపథ్యంలో కోర్టు తీవ్రంగా స్పందించింది. అయితే 2.O చిత్రం లీక్ కావడంపై మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. 10000 మంది టెక్నిషియన్లు పనిచేసిన సినిమాను ఒక్కరోజులోనే పైరసీకి గురిచేయడం అన్యాయమని పేర్కొన్నది.

 లైకా ప్రొడక్షన్ ప్రయత్నాలు ఫెయిల్!

పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయండి. దాదాపు 12 వేల వెబ్‌సైట్లు జాబితాలో ఉన్నాయి. వాటన్నింటిపై ఆంక్షలు విధించాలని 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు గురువారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, లైకా ప్రొడక్షన్స్ న్యాయవాది సుబ్రమణియన్ హైకోర్టుకి 12,564 అక్రమ వెబ్ సైట్ల లిస్టు సమర్పించారు. పైరసీ విషయంలో తమిల్ రాకర్స్ పోటీ పడుతోందనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

2.0 full movie leaked online by Tamilrockers

తమిళ రాకర్స్ తో పాటు ఇతర వెబ్ సైట్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సినిమా పైరసీకి గురైతే భారీగా నష్టపోయే అవకాశం ఉందని కోర్టుకి వివరించారు. ఇండియాలో 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పైరసీ చిత్రాలను వీక్షిస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు. వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: