తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.  ఇప్పటికే ప్రధాన నింధితుడు రాకేష్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసు విషయంలో పోలీసు బృందాలు విజ‌య‌వాడ, హైద‌రాబాద్‌లో ద‌ర్యాప్తును వేగం చేశారు. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన రూట్ మ్యాప్‌ను, జ‌య‌రామ్ యూఎస్ నుంచి భార‌త్‌కు వచ్చాక జ‌రిగిన క‌ద‌లిక‌లు, శిఖా చౌద‌రీ, రాకేష్ రెడ్డి మూమెంట్స్ పై విచార‌ణ జరుపుతున్నారు. 

ఈ మర్డర్‌లో ఓ సినీ నటుడి హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అందులో భాగంగా పోలీసులు నటుడు సూర్యప్రసాద్‌ని విచారించారు.  ‘ఆ నలుగురు’సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ కుమారుడి పాత్ర  పోషించాడు సూర్య ప్రసాద్.  నిన్న రాత్రంతా సూర్య ప్రసాద్ ను విచారించిన హైదరాబాద్ పోలీసులు, తెల్లవారుజామున 4 గంటలకు అతన్ని వదిలిపెట్టారు.  విచారణ అనంతరం బయటకు వచ్చిన సూర్య ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..కేసులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారని, అందులో భాగంగానే తననూ పిలిపించారని అన్నాడు.
Image result for jayaram murder
హత్యకు ముందు రాకేష్ రెడ్డి ఓ యువతితో జయరామ్ కి ఫోన్ చేయించారని..అలా ట్రాప్ లోకి లాగారని విచారణలో పోలీసులు చెబుతున్నారు.  అయితే ఈ విషయంపై తనపై అనుమానాలు వచ్చాయని.. అమ్మాయి గొంతుతో జయరామ్ తో తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశాడు. జయరామ్ హత్యకేసుతో తనకు సంబంధం లేదని, అదే విషయాన్ని పోలీసులకు చెప్పానని అన్నాడు.  అమ్మాయి గొంతుతో జయరామ్ కు ఫోన్ చేయించిన తరువాతే, ఆమెను కలవాలన్న ఆశతో వచ్చిన జయరామ్ ను నిర్బంధించి హత్య చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: