తెలుగు సినిమా వెండి చందమామ కాజల్ అగర్వాల్. నిండైన అందం.దానికి తోడు చక్కని టాలెంట్ అన్నీ ఉన్న కాజల్ టాలీవుడ్ ని చాలాకాలం పాటు యువరాణిలా ఏలింది. ఇక ఆమె టాప్ హీరోలందరి పక్కన చేసింది. ఎందరికో కానీ తీరని కల మెగాస్టార్ చిరంజీవితో నటించడం.అది కాజల్ చాలా ఈజీగా తీర్చేసుకుంది.


కాజల్ దశాబ్దం పైగా సినీ కెరీర్ విజయవంతంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇపుడు నిర్మాతగా కూడా మారి కాన్సెప్ట్ మూవీస్ తీయాలనుకుంటోంది. ఇవన్నీ ఇలా ఉంచితే లేటెస్ట్ గా  కాజల్ మీద ఓ న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ లవ్ యూ చెప్పాలని రిమైండ్ పోస్టు చేసింది. దీనిని బట్టి ఆమె ప్రేమలో వున్నట్లు టాక్ వస్తోంది. అలాగే, కాజ‌ల్ అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులు మాత్రం కాస్త ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.


తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాగ్రౌండ్ క‌ల‌ర్ మాత్ర‌మే ఇచ్చి.. క్విక్ రిమైండర్.. ఐ లవ్ యు అని పోస్ట్ చేయడం మాత్రం హాట్ టాపిక్ గా ఉంది. దీంతో దీని పరమార్ధం ఏంటని హాట్ హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే తాను ప్రేమ పెళ్ళి చేసుకుంటానని కాజల్ చెప్పింది మరి. 


టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమలో వుందా అంటే అవుననే అంటున్నాయి.. టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే.. కాజల్ అగర్వాల్ రహస్య ప్రేమికుడికి ఐ లవ్యూ చెప్పింది.  కాజల్ కనుక లవ్వులో ఉంటే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి అది బ్యాడ్ న్యూసే మరి. తమ కలలరాణి హార్ట్ బ్రేక్ చేసిందని కిర్రకు అయిపోతారేమో.  ప్రస్తుతం త‌మిళ‌నాట కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.  
 



మరింత సమాచారం తెలుసుకోండి: