టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పిలిచే నటి హేమకు దారుణమైన అవమానం జరిగింది.  నేడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీ కారోత్సవం జరిగిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా నటి జీవిత తన స్పీచ్ ముగిసన తర్వాత నటి హేమకు మైక్ ఇచ్చింది. ఇక మా అధ్యక్షుడు నరేష్ గురించి ఏదో మాట్లాడుతున్న సమయంలోనే హటాత్తుగా హేమ మైక్ ని లాగలాగేసుకున్నారు.  దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ కి గురయ్యారు. 

హేమ కొంత కాంగా మా అసోసియేషన్ లో ఎన్నో సేవలు చేస్తున్న విషయం తెలిసిందే.  గతంలో మా ఎన్నికల సందర్భంగా ఆమె చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.  నరేష్ మైక్ లాగిన వెంటనే..హేమ ముఖం చిన్నబోయింది..ఇది గమనించిన జీవిత, రాజశేఖర్‌లు ఆమెకు మైక్ అందించారు. అప్పటికే అవమానంగా బాధపడుతున్న హేమ ‘మా’లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.

ఇప్పటి వరకు ఆయన వేదికపై ప్రకటించినవన్నీ తమతో చర్చించకుండానే ప్రకటించారని మండిపడ్డారు. జనరల్ బాడీ మీటింగ్‌లో కూర్చుని మాట్లాడిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చివరగా నరేష్ గారూ..ఇలా మైక్ లాగడం ఏమీ బాగాలేదు..నాకు అస్సలు నచ్చేలేదని చురకలు అంటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: