అందం..అభినయం ఆమె సొంతం.  ఒకప్పుడు అగ్ర హీరోలతో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న పవిత్ర గురించి తెలియని వారు ఉండరు.  ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్ల తల్లి పాత్రల్లో కనిపిస్తున్న పవిత్ర ఒకప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె జీవితంలో కొన్ని మరుపురాని సంఘటనలు ఆడియన్స్ తో పంచుకుంది.   'పవిత్ర' అనే పేరును మా నాన్నగారు నాకు పెట్టారు .. నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. కన్నడ సినిమాల్లో అప్పట్లో ఆయన మంచి క్రేజ్ వున్న నటుడు. 

ఆ సమయంలో ఆయన వెంట కొన్ని సార్లు షూటింగ్ కి వెళ్లాను..అక్కడ వాతావరణం నన్ను ఎంతో ప్రభావితం చేశాయి.  ఆ రంగుల ప్రపంచంలోకి నేను అడుగు పెడితే బాగుండని అనిపించేది..కానీ నాన్న మాత్రం నన్ను చదుపై దృష్టి పెట్టాలని అనేవారు.  దురదృష్టవశాత్తు నేను 9వ క్లాస్ పాసై 10వ తరగతిలోకి వెళ్లేముందు మా నాన్నగారు చనిపోయారు. కన్నడ స్టార్ హీరో అంబరీశ్ గారు మా నాన్నగారికి మంచి స్నేహితులు.  ఒకదశలో ఆయన మా కుంటుంబాన్ని ఎంతో ఆదరించి ధైర్యం చెబుతూ వచ్చారు.

ఆ సమయంలో అంబరీష్ గారు నన్ను నువ్వు సినిమాల్లోకి రావొచ్చుగదా .. నటించవచ్చుగదా  అన్నారు. అలా ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చాను  అని చెప్పుకొచ్చారు.  నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు 'గీతాంజలి' సినిమాను చూశాను. ఆ సినిమాలో నాగార్జునగారిని చూసిన తరువాత నా జీవితంలోను ఇలాంటి మనిషి వుంటే బాగుంటుంది గదా అనిపించింది. నాగార్జునగారితో కలిసి నటించడం కుదరలేదు..నాగార్జునగారితో ఇంతవరకూ మాట్లాడలేదు.. ఆయన కనిపించినా మాట్లాడే ధైర్యం చేయలేదు అని చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: