తెలుగులో బూతు సినిమాలకు కొదవు లేకుండా పోతుంది. కాసుల వర్షం కురిపిస్తుండటంతో నిర్మాతలు దిగజారి మరి సినిమాలు తీస్తున్నారు. 'రొమాంటిక్ క్రిమినల్స్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్లు ఇంటర్నెట్లో సంచలనం రేపుతున్నాయి. కాలేజీ కుర్రకారు చాటు మాటుగా చేసే రొమాన్స్, శృంగార కార్యకలాపాలను పచ్చిగా ఈ చిత్రంలో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.


చెడుదారి పట్టిన యువత ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు, వారు క్రిమినల్ చర్యలకు పాల్పడటానికి కారణం ఏమిటనే విషయాలను చర్చిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది.  ఈ సినిమాపై యువతలో క్రేజ్ పెంచడమే లక్ష్యంగా ఇటీవల విడుదలైన టీజర్లో అన్నీ బూతులే చూపించారు. ముద్దు సన్నీవేశాలు, రొమాంటిక్ సీన్ల డోస్ సినిమాలో ఏ రేంజిలో ఉంటుందో హిట్ ఇవ్వడం ద్వారా హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 


ఎక్కువ మాట్లాడితే కులం పేరు, మతం పేరు కూడా తీసుకొస్తా ప్రిన్సిపల్ సర్... నేనొక పనికిమాలినదాన్ని, నా గురించి మీ లైఫ్ ఎందుకు పాడుచేసుకుంటారు చెప్పండి. మీరు రాముడైనా సరే... శూర్పణక ఏడుస్తూ ప్రెస్ మీట్ పెడితే రావణాసుడివి అయిపోతావు ఈ మెరుగైన సమాజంలో..'' అంటూ వచ్చే డైలాగులు సినిమా కథ ఎలాంటి అంశాల నేపథ్యంలో ఉంటుందో స్పష్టం చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: