నాగార్జున వయసు అరవైకి చేరువలో ఉంది. కానీ పాతిక అంటే నమ్మేలా ఉన్నాడు. మన్మధుడు అంటే నాగ్ పేరే చెప్పుకోవాలి. ఆ వయసులో కూడా నాగ్ ఫిట్ నెస్ లెవెల్స్ చూస్తే యంగ్ స్టర్స్ అహా అనాల్సిందే. కొడుకు పక్కన వేసిన రకుల్ తో కులుకులు పోతూ నాగ్ వల్లిస్తున్న ప్రేమ పాఠాలు చూసి తీరాల్సిందే. రకుల్ కి ఈడూ జోడూ నాగ్ అంటే నమ్మని వారు ఉండరేమో


నాగ చైతన్యతో రకుల్ రారండి  వేడుక చూద్దాం మూవీలో చేసింది. ఇపుడు తండ్రి నాగ్ తో మన్మధుడు 2 లో సాంగేసుకుంటోంది. నాగ్ ఈ మూవీలో అఖిల్ కి చిన్న అన్నయ్యలా ఉన్నాడని యూనిట్ చెబుతోంది. ఆ సినిమా  స్టిల్స్ చూసినా అలాగే ఉంది. అలా వయసు సగానికి సగం చేసుకోవడం అక్కినేని వంశానికి  ఉందేమో అనిపిస్తుంది.


ఇక నాగ్ విషయానికి వస్తే అటు తన తండ్రి నాగేశ్వ‌రరావు హీరోయిన్లు  శ్రీదేవి, రాధలతో ఆడి పాడారు. ఇపుడు కొడుకు హీరోయిన్లతో పాడుతున్నారు. నిజంగా నాగ్ రేర్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారనిపిస్తోంది. ఇది సినీ చరిత్రలో మరే హీరో చేయని ఫీట్ గా చెప్పుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే నాగ్ కుర్రోడు  అంతే అంటున్నారు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటే నాగ్ అనే చెప్పాలని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: