టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీని నడిపించే నాయకుడు ఎవరని ఒకటే చర్చ మొదలైంది. 70 ఏళ్లకు చేరువ అవుతున్న చంద్రబాబు ఈ స్థితిలో నాయకులకు భరోసా ఇచ్చి పార్టీని నిలబెట్టుకోవడం అంటే అసాధ్యమైన విషయమే. ఇక చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైరవడం మేలంటున్నారు చాలామంది.


మరి బాబు నిష్క్రమిస్తే తెలుగుదేశం పార్టీ నడిపించేది ఎవరు అనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆరే సరైన సమాధానం అంటున్నారంతా. లోకేష్ నో - బాలయ్యనో నమ్ముకుంటే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని - వాళ్ల సమర్థత ఏంటో తెలిసిందే కాబట్టి అత్యవసరంగా జూనియర్ ఎన్టీఆర్ ను తెరమీదకి తేవాలన్న డిమాండ్లు ఆల్రెడీ మొదలైపోయాయి. తెలుగుదేశం అభిమానులే ఈ మాట అంటుండటం విశేషం.


ఎన్నికలతో తారక్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అతడి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అతడే అని.. అతడికి సాధ్యమైనంత త్వరగా బాధ్యతలు అప్పగించకపోతే పార్టీ మనుగడే కష్టం అంటున్నారు. లేదంటే పార్టీ నాశనం అయిపోతుందని.. చంద్రబాబు తనకు తానుగా ఎన్టీఆర్ ను చేరదీసి పగ్గాలు అందించకపోతే.. అతనే పార్టీని భవిష్యత్తులో లాక్కొనే పరిస్థితి రావచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: