స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాఘవేంద్ర రావు శిష్యుడు రాజమౌళి. అప్పటి నుండి చేస్తున్న ప్రతి సినిమా తన మొదటి సినిమాలానే చేస్తూ సినిమా సినిమాకు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇక బాహుబలి సినిమాతో ఎవరు ఊహించని విధంగా ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు.


బాహుబలి సినిమా రాజమౌళి ఐదేళ్ల కష్టం.. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్ ఇలా అందులో నటించిన వారంతా కూడా తమ అద్భుత నటనతో సినిమాకు ప్రాణం పోశారు. రాజమౌళి డైరక్షన్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంచుకున్న కథకు ఎవరు పర్ఫెక్ట్ అన్నది ముందు కనిపెడతాడు. కాస్టింగ్ విషయంలో రాజీ పడడు.


ఇక అనుకున్న కథ అంచనాలను మించి ఉంటే బడ్జెట్ కూడా అదే రేంజ్ లో పెట్టిస్తాడు. బాహుబలి లాంటి సినిమా రాజమౌళి మాత్రమే తీయగలడు అనేలా చేసుకున్నాడు జక్కన్న. ఆయన ప్రతి విషయంలో తీసుకునే జాగ్ర్రత్తలే ఆయనకు అంత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు జక్కన్న.    


ఆ సినిమా కూడా బాహుబలి రేంజ్ కు వెళ్లేలా కనిపిస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి మీద నేషనల్ మీడియా కన్ను పడ్డది. ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి సినిమానే కాదు టాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమా కూడా రాజమౌళి తప్పకుండా మ్యాజిక్ చేస్తాడని అంటున్నారు. మొదటి సినిమా నుండి బాహుబలి రెండు పార్టుల వరకు సక్సెస్ మాత్రమే తన అస్త్రంగా ప్రయోగిస్తున్న జక్కన్న ఆర్.ఆర్.ఆర్ తో కూడా సంచలన విజయం అందుకుంటాడని ఆశిద్దాం.   



మరింత సమాచారం తెలుసుకోండి: