సూపర్ స్టార్ మహేష్ 26వ సినిమా ఎనౌన్స్ మెంట్ నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విషయం తెలిసిందే. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది.


అయితే ఈమధ్య మహేష్ సినిమాలు గమనిస్తే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాయి. మాస్ అంశాలకు దూరంగా మహేష్ కథల ఎంపిక ఉందని చెప్పొచ్చు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా సోషల్ మెసేజ్ తో మహేష్ సినిమాలు వచ్చాయి. కాని సరిలేరు నీకెవ్వరు మెసేజులు ఇచ్చే సినిమా కాదని తెలుస్తుంది.


సినిమాలో మహేష్ మాస్ రోల్ లో కనిపిస్తాడట. ఆర్మీ మేజర్ గా పనిచేస్తూ స్నేహితుడి మరణంతో రాయలసీమలో అతని బదులు మహేష్ వచ్చి ఏం చేశాడన్నది సినిమా కథ అని తెలుస్తుంది. ఆగడు సినిమా మహేష్ మాస్ సినిమాల్లో చివరది. ఊర మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ బాగా ఉన్న సినిమ అది. అయితే శ్రీనువైట్ల రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాను దెబ్బతీసింది.


ఫ్యాన్స్ కొన్నాళ్లుగా కోరుకుంటున్న మాస్ సినిమానే చేస్తున్నాడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు మహేష్ అభిమానులకు ఫీస్ట్ అందిస్తుందట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: