తెలుగు సినిమా రంగంలో క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ఫలక్ నుమా దాస్’ ఇటీవల విడుదలయ్యాయి పర్వాలేదనిపించుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టాక్ ని ఓ తెలుగు హీరో అభిమానులు నెగిటివ్ రూపంలో డైవర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఏ సినిమా హీరో విశ్వక్ సేన్ సదరు హీరో అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. ముఖ్యంగా వీడియోలో విశ్వక్ సేన్ వాడిన భాష తీవ్రస్థాయిలో అతనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


పబ్లిసిటీ కోసం ఇష్టానుసారంగా సోషల్ మీడియా ఉంది కదా అని సమాజంలో పేరుప్రఖ్యాతులు కలిగిన మీరే ఇలా వ్యవహరిస్తే చిల్లరగా ప్రవర్తిస్తే సామాన్యులు ఎలా ఉంటారని విశ్వక్ సేన్ వాడిన భాషపై నెటిజన్లు దారుణంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు తనపై విమర్శలు చేస్తున్న క్రమంలో వివరణ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించడంతో. ఈలోగా కొన్ని న్యూస్ ఛానల్స్ ఇది విజయ్ దేవరకొండ ఫాన్స్ కు విశ్వక్ సేన్ కు మధ్య జరుగుతున్న వార్ గా ఓవర్ గా ప్రోజెక్ట్ చేయడంతో వ్యవహారం ముదిరిపోయింది.


 ఎన్ని చెప్పుకున్న విశ్వక్ సేన్ వాడిన పదాలు మాత్రం అభ్యంతపెట్టేవే. అందుకే పబ్లిక్ గా సారీ చెప్పి మరీ కారణం వివరించాడు. ఇక్కడ మరో కోణం ఉంది. కంటెంట్ ఉండాలే కాని విజయ్ దేవరకొండ ఫాన్సో ఇంకొకరో కాదు ఆ దేవుడే దిగి వచ్చినా సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఫేస్ బుక్ ప్రచారం చేసినంత మాత్రాన పోస్టర్ చింపేస్తే సినిమా ఫ్లాప్ కాదు. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి విశ్వక్ సేన్ ఇంతలా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. మొత్తం మీద చిన్నపాటి విషయం కోసం విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో వాడిన భాష ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: