పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ కు దిగుతానంటావేమిటి?.... ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే పూలు పూస్తాయా?.... నువ్వు.. వర్జిన్ వే కదా? ఇంకా వర్జిన్ వే కదా?....ఇలాంటి డైలాగ్స్ వింటే ఖచితంగా ఇదేదో ఆర్.ఎక్స్.100, అర్జున్ రెడ్డి..లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో డైలాగ్స్ అని అనుకోవడం పక్కా. అంతేకాదు ఒక యూత్ హీరో సినిమాలో ఉండేది ఇలాంటి డైలాగ్సే కదా అని కూడా అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. ఈ డైలాగ్స్ అన్నీ మన మన్మథుడు చెప్తున్నవి. అవును నిజం..


ఈ డైలాగులు సరిపోతాయి మన్మథుడు 2 ఎలా వుండబోతోందో చెప్పడానికి. నాగ్ ఎవర్ గ్రీన్ హిట్ మన్మథుడు. సినిమాకి సీక్వెల్‌గా కాస్త దాంతో కనెక్షన్ వున్నట్లు అనిపించే సినిమానే మన్మథుడు 2. ఈ సినిమా టీజర్ ను కొన్ని గంటల క్రితం విడుదల చేసారు.  ఈ టీజర్ చూస్తుంటే అందరి దృష్టిలో వయసు అయిపోయిన శ్రీరాముడిలా, వెనుక శ్రీకృష్ణుడిలా రెండు షేడ్స్ తో కనిపిస్తున్నాడు నాగార్జున. మన్మథుడు కంటే కంప్లీట్ డిఫ్రెంట్‌గా ఈ సినిమా ని తెరకెక్కించారని ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది.


వెన్నెల కిషోర్, సీనియర్ యాక్టర్ లక్ష్మి, రావురమేష్ లాంటివాళ్లు సపోర్ట్ గా వున్నారు. టీజర్ ను కంప్లీట్‌గా ఫన్ ఓరియెంటెడ్ గా వుండేలా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కాస్త లైట్ అడల్ట్ టచ్ ఇచ్చామా? లేదా? అన్నట్లు టీజర్‌లో అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో ఈ టైపు కోటే  వర్కవుట్ అయింది. అందుకే మళ్లీ అదే ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది. రాహుల్ రవీంద్రన్ కు ఇది డైరక్టర్ గా రెండో సినిమా. ఆగస్టులో విడుదలయ్యే ఈ సినిమా  నాగ్ స్వంత బ్యానర్ మీద నిర్మాణమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: