బాక్సాఫీస్ రికార్డుల విషయంలో ఇండియాకు బాహుబలి ఎలాగో, ప్రపంచం మొత్తానికి అవతార్ ఆలా. ఈ సినిమా విడుదలై కూడా పదేళ్లు దాటింది. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా ఏ హాలీవుడ్ సినిమా అందుకోలేకపోయింది. 2.78 బిలియన్ గ్రాస్ తో ప్రపంచంలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా అవతార్ ఇప్పటికీ కొనసాగుతుంది.

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2009లో విడుదలైంది. ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి కానీ, ఏ ఒక్కటి అవతార్ కలెక్షన్స్ దరిదాపుల్లోకి రాలేకపోయాయాయి. పదేళ్ల తర్వాత ఆ రికార్డ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎసరుపెట్టేలా ఉన్నది.

ఏప్రిల్ 26న వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.73 బిలియన్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో రెండవ స్థానంలో ఉన్న 'టైటానిక్' ను మూడవ స్థానానికి నెట్టేసిన ఈ చిత్రం ప్రస్తుతం 'అవతార్' రికార్డుకు ఎసరు పెట్టే దిశగా కొనసాగుతోంది.

ఈ సినిమా రిలీజై దాదాపు ఒకటిన్నర నెల దాటినా ఇంకా కలెక్షన్స్ ఫిగర్ పెరుగుతూనే ఉంది. ఇదే ఊపు కొనసాగితే అతి త్వరలో 'అవతార్' హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయం అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: