ఎలక్షన్స్ లో ఓటమిని చవిచూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తాడని అంటున్నారు. అయితే పవన్ తన ప్రచారంలో భాగంగా ఇక సినిమాలు చేసేది లేదని చెప్పాడు. కాని మళ్లీ మనసు మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కూడా వెంటపడడంతో పవన్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడని అనుకున్నారు.


అయితే మెగా బ్రదర్ నాగబాబు వర్షన్ మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఉంది. పవన్ కళ్యాణ్ 90 శాతం సినిమాలు చేసే అవకాశం లేదని అన్నాడు. చిరంజీవి రాజకీయాలను వదిలేశారు కాబట్టే సినిమాలు చేస్తున్నారని పవన్ అలా కాదని పాలిటిక్స్ లో ఉంటారని చెప్పుకొచ్చాడు. గెలిచినా ఓడినా పవన్ తోనే తన ప్రయాణం అని అన్నారు నాగబాబు.


పవన్ సినిమాలు చేసే అవకాశం లేదని ఒకవేళ చేసినా గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తాడని అంటున్నాడు నాగబాబు. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం పవన్ ను మళ్లీ సినిమాల్లో చూడాలని ఆశ పడుతున్నారు. మరి నిజంగానే నాగబాబు చెప్పినట్టు పవన్ సినిమాలను ఆపేస్తాడా కేవలం గెస్ట్ రోల్స్ కే పరిమితం అవుతాడా అన్నది తెలియాల్సి ఉంది.


పవన్ ఓకే అంటే మైత్రి మూవీ మేకర్స్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆల్రెడీ సుబ్బిరామిరెడ్డి కూడా చిరు, పవన్ తో కలిపి సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు ఈ క్రేజ్ తెచ్చిన సినిమాలను కూడా పవన్ కొనసాగిస్తేనే బెటర్ అని అంటున్న వారు ఉన్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు పవన్ సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: