కొన్ని జంటలు వెండితెరకే అందం. ఆ జోడీలను చూస్తే ఇటు ప్రేక్షకులు సైతం పరవశించి పులకరించి పోతారు. కొన్నేళ్ళ పాటు టాలీవుడ్ ని శాసించిన జంటలు ఎన్నో. వారిని హిట్ పెయిర్ అంటారు. అటువంటి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే నిజమే అంటున్నారు. ఓ వైపు మెగస్టార్ చిరంజీవి ఇప్పటికీ నటిస్తున్నారు. అలాగే నందమూరి బాలక్రిష్ణ కూడా తనదైన జోరును కొనసాగిస్తున్నారు.


మరి 80 90 దశకంలో వారిద్దరితో జోడీ కట్టిన టాప్ హీరోయిన్ విజయశాంతి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ మూవీలో కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ తరువాత ఆమెకు వరస ఆఫర్ల వెల్లువ కనిపిస్తోంది. అందులో చెప్పుకోవాల్సింది నాడు తాను జోడి కట్టి ఆడి పాడిన మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించే మూవీ ఉండడం టాలీవుడ్లో ఇంటెరెస్టింగ్ మ్యాటర్ అయింది.


చిరంజీవి సైరా కంప్లీట్ అవుతోంది. తరువాత కొరటాల శివ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. ఆ మూవీలో విజయశాంతి చిరంజీవితో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కనిపించనుందని టాక్. ఒకవేళ ఈ మూవీ కాకపోతే త్రివిక్రం శ్రీనివాస్ చిరంజీవి కాంబోలో వచ్చే మూవీలో కూడా విజయశాంతి నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా చిరు మూవీలో  విజయశాంతి పాత్రలు కీలకం అవుతాయని అంటున్నారు. ఇక నందమూరి బాలక్రిష్ణ మూవీలో కూడా విజయశాంతి నటించే అవకాశం ఉంది. బాలయ్య, విజయశాంతి జంట అంటే అప్పట్లో కన్నుల పంటే. మరి ఈ ఇద్దరూ నటించే మూవీ ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: