రాజశేఖర్ హీరోగా 'అ!' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. కల్కి పై క్రిటిక్స్ తమదైన శైలిలో పంచ్ లు వేశారు. ఫస్టాఫ్ ఓపిగ్గా చూస్తేనే సెకండాఫ్ అర్థమవుతుందని, క్లైమాక్స్ వరకూ వెయిట్ చేయడం కష్టమేనని ఘాటుగా రాశారు. క్లైమాక్స్ ముందు ట్విస్టులు గొప్పగా ఉన్నా.. వెయిట్ చేయడమే కష్టమని రివ్యూల్లోను స్పష్టం చేశారు. అయితే దీనిపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన పంచ్ కూడా అలానే ఉన్నాయి. కథలోంచి క్లైమాక్స్ పుడుతుందా?  క్లైమాక్స్ పుట్టాక కథ పుడుతుందా? అన్న ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయో సమాధానం ఇచ్చాడు. 

చాలా మంది కథ రాస్తున్నామంటారు. నేనైతే క్లైమాక్స్ రాస్తాను. క్లైమాక్సే కథ. క్లైమాక్స్ రాసేసుకుంటే మిగతా అంతా ఈజీ అని అన్నారు. డెస్టినేషన్ తెలిస్తే మిగతాదంతా ఈజీ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆడియెన్స్ ని 2 గం.లు వెయిట్ చేయించి చివరిగా రివీల్ చేయడమే స్క్రీన్ ప్లే.  క్లైమాక్స్ కి ముందు ఆడియెన్స్ ని వెయిట్ చేయించడం అన్నది ఒక తరహా స్క్రీన్ ప్లే. కల్కి కథకు ఈ తరహా స్క్రీన్ ప్లేనే కరెక్ట్. నేను నెక్ట్స్ తీసే సినిమాకి స్క్రీన్ ప్లే వేరేగా ఉంటుంది. అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటుంది.. క్లైమాక్స్ అంత ఉండకపోవచ్చు..అని అన్నారు. మల్టిపుల్ వెర్షన్స్ రాసుకుని .. ఏడాది కేటాయించి చేసిన చిత్రమిది. క్లైమాక్స్ కోసం 16 వెర్షన్లు రాశానని ప్రశాంత్ వర్మ తెలిపారు. 

వెయిట్ చేయించడం అన్నది మీ సినిమాల్లో కామన్ అని ఆడియెన్ భావిస్తారేమో!! అని ప్రశ్నిస్తే.. అలాంటిదేం లేదు. నా సినిమాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్లతో ఉంటాయి. స్టీరియోటైప్ సినిమాలు తీయను. జోనర్ల పరంగా కొత్తగా ప్రయత్నిస్తాను. ఏ కథ ఎంచుకున్నా సంవత్సరం పాటు శ్రమిస్తాను.. అన్నాడు. కమర్షియల్ అంశాల కోసం కొన్నిటిని ప్రత్యేకంగా రాసుకున్నారా? అన్న ప్రశ్నకు అవునని అన్నారు. ఇక కేజీఎఫ్ స్ఫూర్తితో యాక్షన్ ని తీర్చిదిద్దానని అతడు అంగీకరించడం ఆసక్తికరం. 


మరింత సమాచారం తెలుసుకోండి: