మాటల మాంత్రీకుడు, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరక్టర్ తివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన ప్రాజెక్టులు చాలానే వున్నాయి. వాటిలో మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు వార్తల్లో వినిపిస్తూనే వున్నాయి. అయితే వీటిలో మహేష్ బాబు సినిమాను లిస్ట్ లోంచి దాదాపు తీసేయవచ్చునని ఇంతకముందే అన్నారు. ఇక చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్. వీటిల్లో వెంటనే వుండేది ఎన్టీఆర్ సినిమానే అని తెలుస్తోంది. జనవరి నాటికి త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతారు. అప్పటివరకు ఎన్టీఆర్ కూడా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి దాదాపు ఫ్రీ అయిపోతారని తెలుస్తోంది. 

ఈ ఇద్దరు కలిసి 2020 దసరాకు ఓ సినిమాను అందించే దిశగా సనాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి నాటికి ఇటు వెంకటేష్ కానీ, చిరంజీవి కానీ రెడీగా వుండరు. వాళ్లు ఇద్దరు బిజీగానే వుంటారు. అదీకాక అరవింద సమేత తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరన్న విషయం కూడా తెలిసిందే.
అరవింద సమేత సినిమా టైమ్ లో ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కు మధ్య బాండింగ్ చాలా బాగా కుదిరింది. 

అందుకే బన్నీతో  ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా తరువాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమానే ఫిక్స్ అవొచ్చని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అందిన సమాచారం.
ఇక మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా అన్నది ఆ తరువాత విషయం. వుంటే వుండొచ్చు.. లేకపోతే లేదు. గ్యారంటీ అయితే లేదు అని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. అయితే చిరంజీవి మాత్రం ఈ మాటల మాంత్రీకుడితో సినిమా చేయాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: