శ్రీహ‌రి విషాదం త‌రువాత టాలీవుడ్ ఇండస్ట్రీకు వెలితి ఏంటో తెలిసొచ్చింది. ఓ మంచి న‌టుడుని కోల్పోయామే అన్న బాధకంటే, ఓ మంచి వ్యక్తిని కోల్పాయ‌మ‌నే బాధే టాలీవుడ్ ఇండ‌స్ట్రీను బాధిస్తుంది. టాప్ హీరోల స్టోరీల‌కు బెస్ట్ స‌పోర్టింగ్ రోల్స్ కోసం ఎవ‌రిని తీసుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి. టాలీవుడ్‌లో రూపొందుతున్న కొన్ని మూవీల‌లో శ్రీహ‌రినే ఎంచుకోవాలి అని రెడీ అయిన స్టోరీల‌లో ఇప్పుడు మార్పులు జ‌రుగుతున్నాయి. 

ఆ విధంగా మార్పులు జ‌రుగుతున్న క‌థ‌ల‌లో టాప్ హీరోల మూవీలు కూడ ఉన్నాయి. ఇదిలా ఉంటే, శ్రీహ‌రి చివ‌రిగా న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం రాంబోరాజ్‌కుమార్‌. ఈ మూవీను ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభుదేవాకి, శ్రీహ‌రి మంచి సంబంధాలు ఉన్నప్పటికి ఇప్పటి వ‌ర‌కూ ప్రభుదేవా శ్రీహ‌రి గురించి ఒక్క కామెంట్ కూడ చేయ‌లేదు.

కాని రాంబో రాజ్‌కుమార్ మూవీకు సంబంధించిన షూటింగ్స్‌ను మాత్రం య‌ధావిధిగా పూర్తి చేసుకుంటున్నాడు. ఈ మూవీలో శ్రీహ‌రి విల‌న్ పాత్ర చేస్తున్నాడు. శ్రీహ‌రి  అకాల మ‌ర‌ణంతో ఆ పాత్రకు ఎటువంటి న్యాయం చేయాలో డైరెక్టర్‌కు అర్ధం కావ‌డంలేదు. శ్రీహ‌రికి సంబంధించిన పాత్రను పూర్తిగా తొల‌గించి, ఆ పాత్రలో మ‌రొ యాక్టర్‌ను తీసుకుంటున్నట్టు బాలీవుడ్ స‌మాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీహ‌రిని పాత్రను తొల‌గించ‌కుండా మేనేజ్ చేయ‌వ‌చ్చు అనేది చిత్రయూనిట్‌లో జ‌రుగుతున్న డిస్కష‌న్స్‌. శ్రీహ‌రి మార్పే నిజం అయితే శ్రీహరి అంత‌టి న‌టుడికి ప్రభుదేవా అన్యాయం చేసిన‌ట్టేన‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: