అయితే మైత్రి మూవీ మేకర్స్ సైతం కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తోందని లీకులు అందాయి. తాజాగా ఇదే విషయంపై మైత్రి సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఫుల్ క్లారిటీనిచ్చేశారు. ఎన్టీఆర్ - కేజీఎఫ్ డైరెక్టర్ కాంబినేషన్ మూవీని అధికారికంగా కన్ ఫామ్ చేశారు.``కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ప్రాసెస్ లో ఉంది. ఎన్టీఆర్ కి కేజీఎఫ్ సినిమా ఎంతో నచ్చింది. ప్రశాంత్ నీల్ పేరును ఎన్టీఆర్ స్వయంగా సూచించారు. తనవద్ద మంచి కథ ఉంటే చేద్దామని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది`` అని నవీన్ తెలిపారు. ``ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్తవ్వాలి. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రణాళికలో వేగం పెంచుతా``మని ఆయన వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించిన `డియర్ కామ్రేడ్` ఈనెల 26న రిలీజవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ ఎర్నేని పై సంగతుల్ని ముచ్చటించారు.