బిగ్ బాస్ సీజన్ 3 మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్టార్ మా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీజన్ ను రెడీ చేస్తున్నారు. ముఖ్యంగా కింగ్ నాగార్జున ఈసారి హోస్ట్ గా చేస్తుండటం ఈ సీజన్ కు మరింత పబ్లిసిటీ వచ్చింది. మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అవగా ఈ సీజన్ ఎలా ఉండబోతుందా అన్న ఎక్సైటింగ్ ఆడియెన్స్ లో ఉంది.


బిగ్ బాస్ సీజన్ 3లో 14 మంది కంటెస్టంట్స్ ఉంటారని తెలుస్తుంది. 100 రోజులు వాళ్లు ఆ హౌజ్ లో ఉండాల్సి ఉంటుంది. ఈసారి అందరిని సెలబ్రిటీస్ ను తీసుకున్నారని తెలిసిందే. అయితే 14 మంది కంటెన్స్టంట్స్ లో కొందరు ఫైనల్ అయ్యారు. వాళ్లు ఎవరంటే సందీప్ కిషన్, శ్రీముఖి, హేమ, హిమజ, యాంకర్ సావిత్రి వీళ్లవరకు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.


మిగతా వాళ్లెవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈసారి బిగ్ బాస్ టాస్కులు కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. నాగార్జున ఇప్పటికే ఎం.ఈ.కే సూపర్ సక్సెస్ కొట్టగా బిగ్ బాస్ సీజన్ 3 దానికి మించి సక్సెస్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్ కంటెస్టంట్స్ అంతా సిద్ధమవుతుండగా వారిని చూసేందుకు ఆడియెన్స్ కూడా రెడీ అయ్యారు.


మొదటి సీజన్ లో శివ బాలాజి టైటిల్ విన్నర్ కాగా.. సెకండ్ సీజన్ లో కౌశల్ ఆ ఛాన్స్ కొట్టేశాడు. మరి బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరన్నది చూడాలి. టైటిల్ విన్నర్ ఎవరైనా సీజన్ 3లో అందరు సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా వస్తున్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: