టాలీవుడ్ కి ఎపుడు కొత్త మీద మోజు. పాత మీద వెగటు. అందుకే మూవీకో హీరోయిన్ మారిపోతారు. ఇదిలా ఉండగా సినిమ సినిమాకు కొత్త హీరోయిన్లు వస్తున్నా ఎంతమంది సెటిల్ అవుతున్నారంటే అనుమానమే. ఇక దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ జీవితల రెండవ కూతురు శివాత్మిక ఇపుడు టాలీవుడ్లో హాట్ ఫేవరేట్ గా మారుతోంది. తొలి మూవీలో ఆమె నటన. నాఛురల్ బ్యూటీకి బాగానే మార్కులు పడుతున్నాయి.


లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన శివాత్మికకు ఈ మూవీలో కళ్ళతోనే నటించే చాన్స్ దక్కింది. అప్పట్లో పాత హీరోయిన్లకు దక్కిన అవకాశం ఇది. ఇపుడు శివాత్మిక అభినయం అంతా కళ్ళతో చూపించేసరికి టాలీవుడ్ ఫిదా అవుతోంది. దాంతో ఆమెకు వరసపెట్టి రెండు మూవీస్ చేతిలోకి వచ్చేశాయి.


పైగా బ్యాక్ గ్రౌండ్ జీవితా రాజశేఖర్ ఉన్నారు. దాంతో దొరసానికి పాజిటివ్ టాక్ రావడం, రెండు సినిమాల ఆఫర్లు ఉండడంఅతో  శివాత్మిక ఇండస్ట్రీలో  నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరైన సబ్జెక్ట్ తో మూవీస్ చేస్తే ఆమె సైతం తల్లి  జీవిత మాదిరిగా కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్ ని ఏలే అవకాశాలుఎక్కువగా  ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి దొరసాని పేరుని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: